Home మంచిర్యాల మున్సిపాలిటీల్లో అన్నపూర్ణకు శ్రీకారం

మున్సిపాలిటీల్లో అన్నపూర్ణకు శ్రీకారం

The Minister ktr issued orders to the officials

అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి కెటిఆర్
ఐదు రూపాయలకే పేదలకు అన్నపూర్ణ భోజనం
ఏడు మున్సిపాలిటీల్లో అమలుకు సన్నాహాలు
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న అధికార యంత్రాంగం

మన తెలంగాణ/మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల కోసం రాష్ట్ర వ్యాప్తం గా అన్ని మున్సిపాలిటీలలో అన్నపూర్ణ భోజన పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల పురపాలక మంత్రి కెటిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర రాజధానిలో అ మలు చేస్తుండగా కార్యక్రమానికి పేద ప్రజల నుంచి స్పందన రావడంతో అన్ని మున్సిపాలిటీల్లో అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని పేదలకు రూ.5కే భోజనాన్ని అందిస్తారు. నాలుగేళ్ల కిందటే ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ కేవలం హైదరాబాద్‌కే పరిమితమైంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేయాలని మంత్రి కెటిఆర్ ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగంలో కదలికలు మొదలయ్యా యి. ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి,కాగజ్‌నగర్, మంద మర్రి, నిర్మల్, భైంసా, ఆదిలాబాద్ మున్సిపాలిటీలలో అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మంచిర్యాల మున్సిపాలిటీలో 85 వేల జనాభా ఉన్నట్లు అధికారుల గణాంకాలు తెలుపుతున్నప్పటికీ జిల్లా కేంద్రం గా ఏర్పాటు అయినప్పటి నుంచి 1.20 లక్షలకు జనాభా పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. మంచిర్యాలతో పాటు కొమ్రంభీం, నిర్మల్ జిల్లాలు ఏర్పాటు కావడంతో ప్రతినిత్యం జిల్లా కేంద్రాలకు పనుల నిమిత్తం దాదాపు 4 వేల నుంచి 6 వేల మంది వచ్చి వెళ్తుంటారు. అయితే వీరికి అన్నపూర్ణ భోజనం పథకం కింత రూ. 5కే భోజనం అందిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోని పలు హోటళ్లలో భోజనం ధరలు రూ.50 నుంచి రూ.80 వరకు ఉండగా పేద కూలీలు, విద్యార్థులు చిరు ఉద్యోగులు, కార్మికులు ఎంతో ఇబ్బందులకు గురువుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ బోజన పథకం కింద రూ. 5కే భోజనం అందిస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంచిర్యాల మున్సిపాలిటీలో ప్రతినిత్యం వివిధ పనులపై 10 వేల మంది వస్తుండగా అన్నపూర్ణ భోజనం అవసరమైన వారు సుమారు 4 వేల వరకు ఉంటారు. అదే విధంగా కాగజ్‌నగర్‌లో 8 వేల మందికి గాను 4 వేల మందికి, బెల్లంపల్లిలో 5 వేల మందికి గాను 2 వేల మందికి,మందమర్రిలో 3 వేల మందికిగాను 15 వందల మందికి, నిర్మల్‌లో 8 వేల మందికి గాను 4 వేల మందికి, ఆదిలాబాద్‌లో 10 వేల మందికి గాను 4 వేల మందికి అన్నపూర్ణ భోజనం అవసరం ఉంటుందని అధికారులు అంచన వేస్తున్నారు. కొమురంభీం జిల్లా ఏర్పాటు అయినప్పటికీ నుంచి మహారాష్ట్ర, గడ్చిరోలి జిల్లాల నుంచి కూడా వేలాది మంది వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తుంటారు. మంచిర్యాలకు కూడా రాకపోకలు కొనసాగిస్తారు. ఈవిషయమై మంచిర్యాల మున్సిపల్ కమీషనర్ శ్రీకాంత్ వివరణ కోరగా మంత్రి కేటిఆర్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలో అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు పరిశీలిస్తున్నామన్నారు. ఈమేరకు కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.