Search
Thursday 15 November 2018
  • :
  • :

జూన్ 30లోపు మిషన్ కాకతీయ పనులు పూర్తి

amrapali*అధికారులను ఆదేశించిన మంత్రి కడియం
*నాల్గవ దశలో 708 చెరువుల పునరుద్ధరణ
*ఫిబ్రవరి 3నుంచి నాల్గవ దశ పనులను ప్రారంభించాలి
*ప్రతి 15రోజులకోసారి సమీక్ష

మనతెలంగాణ/వరంగల్‌బ్యూరో: రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ మొదటి, రెండు, మూడో దశలలో చేపట్టి మిగిలిన పనులను, నాల్గో దశలో చేపడుతున్న పనులను ఈ సంవత్సరం జూన్ 30లోగా పూర్తిచేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మిషన్ కాకతీయ కార్యక్రమ అమలుపై ఐదుజిల్లాల ఇంజనీరింగ్ అధికారుల తో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడు తూ మిషన్ కాకతీయ నాల్గో దశలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 708 చెరువుల పునరుద్దరణ పనులకు అంచనాలు, పాలనాపరమైన అనుమతులు వచ్చాయన్నారు. వీటిని ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభించాలని అధికారులకు సూచించారు. 708 చెరువులకు సంబంధించిన టెండర్ల, అగ్రిమెంట్ల ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో పనులను ప్రారంభించి పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పనులకు ఒక ప్రణాళికబద్ధంగా పూర్తి చేయుటకు షెడ్యూల్ రూపొందించుకొని వాటికి అనుగుణంగా సమీక్షలు నిర్వహించుకోవాలని కడియం సాగునీటి శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. మిషన్ కాకతీయ పనులను జాయింట్ కలెక్టర్లు అటు ఇంజనీర్లతోను, పనులు చేస్తున్న కాంట్రాక్టర్లతోను ప్రతి పదిహేను రోజులకొకసారి సమీక్షించాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.ఈ సందర్భంగా జిల్లాల వారి గా మిషన్ కాకతీయలో మొదటి, రెండవ, మూడవ దశలలో చేపట్టిన పనుల వివరాలను అధికారులను అడిగి కడియం తెలుసుకున్నారు.
రామప్ప సుందరీకరణ పనులు చేపట్టాలి: ఎంపి అజ్మీర సీతారాంనాయక్
రామప్ప చెరువు సుందరీకరణ పనులను వెంటనే చేపట్టాలని మహబూబాబాద్ ఎంపి అజ్మీర సీతారాంనాయక్ కోరారు. జంపన్నవాగులో చెక్‌డ్యాంల నిర్మాణ పనులను త్వరిగతిన ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.
పరకాల మినీట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయాలి : ఎంఎల్‌ఎ
పరకాల నియోజకవర్గ కేంద్రంలో నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ నిర్మాణపు పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని పరకాల శాసన సభ్యుడు చల్లా ధర్మారెడ్డి అధికారులకు సూచించారు. పనులు జాప్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జనగామ శాసన సభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ తరిగొప్పుల చెరువులో మరింత లోతుగా పూడికతీత జరిపితే అక్కడి చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలకు నీరందించవచ్చన్నారు. మహబూబాబాద్ ఎంఎల్‌ఎ శంకర్‌నాయక్ మాట్లాడుతూ మానుకోట నియోజకవర్గంలో మిషన్ కాకతీయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్ కాట అమ్రపా లి మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి ఆదేశాలను, సూచనలను పాటించి మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, ఎస్‌ఇ ఆంజనేయ ప్రసాద్, ఇఇలు, డిఇలు పాల్గొన్నారు.

Comments

comments