Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేస్తున్న ఎంఎల్‌ఏ

aituc

* సిపిఐ చెన్నూర్ నియోజకవర్గం ఇంఛార్జీ బానుదాస్

మన తెలంగాణ/రామకృష్ణాపూర్ : చెన్నూర్ నియోజకవర్గం ప్రజలను ప్రభుత్వ విప్‌నల్లాల ఓదెలు పాదయాత్ర పేరిట మోసం చేస్తున్నారని సిపిఐ చెన్నూర్ నియోజకవర్గం ఇంఛార్జీ బానుదాస్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసిఆర్,నల్లాల ఓదెలు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. మందమర్రి పట్టణంలో తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ తుంగలోతొక్కి మళ్లీ పాదయాత్ర మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. మందమర్రి మున్సిపాలిటీని, గ్రామపంచాయతీలను అభివృద్ది పథకంలో నడిపించకుండా వ్యక్తి గత అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన ఓదెలు మరోసారి నియోజకవర్గం ప్రజలను మోసంచేసేందుకు కంకనం కట్టుకున్నారన్నారు. మందమర్రి మండలంలో ఏర్పాటు చేయాల్సిన ఎస్‌సి గురుకులాన్ని చెన్నూర్ పట్టణానికి తరలించి, మరోసారి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. 2019 ఎ న్నికల ప్రచారంలో భాగంగా ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, మండల కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నాయకులు ఎల్లయ్య, కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments