Home నాగర్ కర్నూల్ కారెక్కనున్న మాజి ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి

కారెక్కనున్న మాజి ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి

The mla yadma kista reddy join in the trs party

కల్వకుర్తి: కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల రైతు బిడ్డ కరెంటు కిష్ణన్న అనే పేరు ఉన్న మాజి ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించిన సుపరిచితుడు. మాజి ఎమ్మెల్యే యడ్మ కిష్టారెడ్డి గతంలో తెలంగాణ ఏర్పాటు కోసం పోరాటాలు చేసి జైలుకు వెళ్ళిన ఉద్యమ నాయకుడు సోషలిస్టు భావాలు గల వ్యక్తి యడ్మ కిష్ణారెడ్డి. తెలంగాణ సిద్దించాక ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రైతు సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి వెంబడి పని చేసేందుకు టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఆయన అనుచర వర్గం తెలిపారు. శనివారం రాష్ట రాజధాని హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ఆయన వర్గియులు తెలిపారు. ఆయన వెంట ఆయన బల పరిచిన పురపాలక కౌన్సిలర్లు, అభిమానులు, నాయకులు నియోజకవర్గంలోని పలు మండలాలలోని నాయకులు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వెంట పని చేసిన కార్యకర్తలు, నాయకులు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.