Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్డు ఇది..!!

మామూలు రోడ్ల మీదనే ఈ రోజుల్లో యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి, మీరు నార్వే లోని అట్లాంటిక్ రోడ్డు ను చూస్తే మాత్రం దడుసుకోవాల్సిందే. అంత ప్రమాదకరంగా ఉంటుంది ఆ రోడ్డు.

అంతేకాదు, ఈ రోడ్డు అత్యంత అందమైన, అద్బుతమైన రోడ్డు కూడానట. అవును, ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నంత సేపు మీరు చందమామ దగ్గరికి వెళ్తున్నట్లే ఉంటుందట. ఉత్తర దృవానికి దగ్గర్లో సముద్ర తీరప్రాంతంలో ఉండే ఈ రోడ్డు నార్వే లో ఉంది. దీన్ని అట్లాంటిక్ రోడ్డు అని అంటారట. ఇంకా, ఈ రోడ్డు మీద వెళ్తున్నంత సేపు సముద్రంలో ఉయ్యాల ఊగినట్లు అనిపిస్తుందట. దాదాపు 8.5 కిలోమీటర్లు ఉండే ఈ రోడ్డు క్రిస్టియన్ సంద్, మోల్డే అనే పట్టణాలను కలుపుతుందట.

Comments

comments