Search
Wednesday 14 November 2018
  • :
  • :

సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం

The most important to solve problems

అధికారుల సమీక్షా సమావేశంలో కమిషనర్ జనార్దన్‌రెడ్డ

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలోని పలు రకాల సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ్ద చూపించాలని జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు, క్షేత్రధికారులను కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం వివిధ అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కమిషనర్లు భారతి హోలికేరి, అద్వైత్‌కుమార్‌సింగ్, శృతిఓజా, సిక్తా పట్నాయక్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరక్టర్ విశ్వజిత్ కంపాటిలు ఈ సమావేశానికి హారయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మై జిహెచ్‌ఎంసి యాప్, డయల్ 100, కాల్ సెంటర్, ట్విట్టర్‌లతో పాటు పలు పత్రికలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సమస్యల పరిష్కారం ద్వారానే సంస్థాగత ఇమేజ్ పెరుగుతుందని అన్నారు. కొన్ని రోజుల క్రితం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిన స్వచ్ఛ ర్యాంకింగ్‌లతో మెట్రో నగరాల విభాగాల్లో హైదరాబాద్‌కు ద్వితీయన స్థా నం లభించిందని, ప్రథమ స్థానంలో గ్రేటర్ ముంబాయి నిలిచిందని అన్నారు. అ యితే ముంబాయి కార్పొరేషన్ ఆర్థికంగా పటిష్టంగా ఉన్న నగరాల్లో దేశంలో ముందంజలో ఉందని అన్నారు. ముంబాయి కార్పొరేషన్ రూ.25 వేల కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ఇతర మెట్రో నగరాలైన బెంగళూరు, చె న్నై, ఢిల్లీ తదితర నగరాలు స్వచ్ఛ ర్యాంకింగ్‌లలో హైదరాబాద్ కన్నా ఎంతో వెనుకబడ్డాయని గుర్తు చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో అగ్రస్థానం పొందడం కీలకమని అన్నారు.

పథకాలపై నివేదికలు ఇవ్వాలి : కమిషనర్
అమలు చేస్తున్న, చేపట్టిన పలు పథకాల పురోగతిపై ప్రతి సోమవారం సవివరమై న నివేదికలు ఇవ్వాలని అన్నారు. సిబ్బంది తక్కువగా ఉన్న ఎస్టేట్స్ తదితర విభాగాను పటిష్టవంతంగా చేయాలని అన్నారు. దేశంలో మరే మెట్రో కార్పొరేషన్‌ల లో లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్‌లో యు.సి.డి విభాగం ద్వారా ఎన్నో కార్యక్ర మాలను చేపట్టామని చెప్పారు. ఈ సంవత్సరం నగరంలోని స్వయం సహాయ క బృందాలకు రూ.320 కోట్లు రుణాలందించాలని, లక్ష్యాన్ని ముందుగానే సా ధించామని అన్నారు. నగరంలో 15 నైట్ షెల్టర్లు పనిచేస్తున్నాయని, మరో నాలు గు నైట్ షెల్టర్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఫుట్‌పాత్ వెండర్ల కు తగిన వెండింగ్ జోన్‌లను గుర్తించడంలో యుసిడి విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు కలిసి, పనిచేయాలని అన్నారు. ప్రస్తుత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడానికి 864 ఖాళీ స్థలాలను గుర్తించామని అన్నారు. జిహెచ్‌ఎంసిలోని వివిధ విభాగాలకు చెందిన ఆస్తుల వివరాలు, ఖాళీ స్థలాల వివరాలను వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని అదేశించారు. నగరంలో చేపట్టానున్న 20 చెరువుల అభివృద్ధికి సంబంధించి మైలు రాయి వివరాలు రూపొందించాలని సూచించారు.

Comments

comments