Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మత్తడి దుంకిన ఉదయసముద్రం

ocean

మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి: ఉదయ సముద్రం పరవళ్ళు తొక్కుతోం ది. గత నెలలో కురిసిన వర్షాలకు కొంత వరదనీరు వచ్చిచేరగా ఏఎమ్మార్పీ కాల్వల ద్వారా ఉదయసముద్రంలోకి నీరు విడుదల చేస్తుండటంతో 0.3 టీఎంసీల నీటి సామర్థం గల పానగల్లు ఉదయ సముద్రం రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి అలుగు పోస్తోంది. గత నెల సెప్టెంబర్‌లో కురిసిన వర్షాల కార ణంగా నాగార్జున సాగర్  ప్రాజెక్టులోకి  577 అడుగుల మేరకు నీరు చేరడంతో సాగర్ నుండి తాగునీటి అవసరాలకు ఎలిమినేటి ప్రాజెక్టు కాల్వల ద్వారా ఉదయ సముద్రంకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పానగల్ రిజర్వాయర్ నిండు కుండలా మారింది. సూమారు 540 గ్రామాలకు తాగు నీరు, వందలాది ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం రిజ ర్వాయర్  సంద్రంలా మారింది. గతంలో 2013 లో నిండిన  ఈ ప్రాజెక్టు ఇన్నా ళ్ళకు మళ్లీ నీళ్ళతో నిండుగా నిండి అలుగు పోస్తుండటంతో చుట్టుప్రక్కల గ్రా మాల ప్రజలు, నల్లగొండ పట్టణ ప్రజలు ఉదయసముద్రాన్ని చూడడానికి దారు లు కడుతున్నారు. అలుగు నీళ్ళలో మునకలు వేస్తూ సందడి చేస్తున్నారు.

Comments

comments