Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

షారూఖ్‌ఖాన్‌పై నిషేధం ఎత్తివేసిన ఎంసిఎ

నిషేధం వీడింది

shahrukh-khan-talks-about-winning-the-ipl-stills06 copyముంబయి: వాంఖడే స్టేడియంలోకి ప్రవేశకుండా ఐదేళ్ల పాటు నిషేధానికి గురైన  బాలీవుడ్ నటుడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారూఖ్ ఖాన్‌కు ఊరట లభించింది. ఐపిఎల్-2012 ఎడిషన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాంఖండే స్టేడియం సిబ్బందితో గొడవపడడంతో ఆగ్రహం చెందిన ముంబయి క్రికెట్ అసోసియే షన్(ఎంసిఎ) షారూఖ్‌పై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. అప్పటి నుంచి వాంఖడే స్టేడియంలో జరిగిన ఏ మ్యాచ్‌కూ షారూఖ్ హాజరుకాలేదు. అయితే ఆదివారం జరిగిన ఎంసిఎ సమావేశంలో అధ్యక్షుడు శరద్‌పవార్ కోరిక మేరకు ఏకగ్రీవంగా షారూఖ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఇక స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్దోషిగా బయటపడిన ముంబయి మాజీ రంజీ ప్లేయర్ అంకిత్‌చావన్‌పై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని బిసిసిఐకి లేఖ రాయడానికి ఎంసిఎ విముఖత చూపింది. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం మేరకే చావన్‌పై నిషేధం కొనసాగుతందని ఎంసిఎకు బిసిసిఐ లేఖ రాయడంతో తన బిసిసిఐ నిషేధం వీడేలా తనకు సహకరించాలన్న అంకిత్ చావన్ విజ్ఞప్తిని ఎంసిఎ తోసిపుచ్చింది.

Comments

comments