Search
Monday 24 September 2018
  • :
  • :

వంజీరిలో యువకుని దారుణ హత్య…

The murder of a young man in Vanjiri

కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని వంజీరి రహదారిపై గురువారం మధ్యాహ్నం ఓ యువకుడు దారుణ హత్యకు గురైనట్టు రూరల్ ఎస్‌ఐ సిరాజ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామగుండం గౌలివాడకు చెందిన మహేష్(24) వంజీరి వెళ్ళే రహదారిపై హత్యకు గురైనట్టు స్థానికుల సమాచారం అందజేయడంతో అక్కడికి వెళ్ళి విచారించగా మృతుడు దేవాపూర్ సిమెంట్ ప్యాక్టిరీలో పనిచేస్తున్నట్టు, మహేష్ హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ఇంచార్జీ సిఐ వెంకటేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల వివరాలను అక్కడ వున్న పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణ అనే మరో యువకుడు మహేష్‌ను గొడ్డలితో నరికి బండరాయితో మోది చంపినట్టు తెలుస్తుందని ఎస్‌ఐ సిరాజ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

comments