Home సినిమా మనిషి తప్పులకు ప్రకృతి ‘సాక్ష్యం’

మనిషి తప్పులకు ప్రకృతి ‘సాక్ష్యం’

Saaksham

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘సాక్షం’ చిత్రం ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంచ భూతాల నేపథ్యంలో ప్రముఖ సింగర్లు పాడిన పాటకు విశేషమైన స్పందన లభిస్తోంది. కర్మ సిద్ధాంతం ప్రాముఖ్యతను చాటుతూ మనిషి చేసే తప్పులకు ప్రకృతి ఎలా సాక్షంగా నిలిచింది అనేది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అంశం. బాహుబలి చిత్రానికి వర్క్ చేసిన విఎఫ్‌ఎక్స్ టీం ‘సాక్షం’కు సిజి వర్క్ చేస్తుండడం విశేషం. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా రూపొందిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేయనున్నారు. శరత్‌కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, మధుగురుస్వామి, జయప్రకాష్, పవిత్ర లోకేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరామెన్‌ః ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటర్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్స్‌ః సాయి మాధవ్ బుర్రా, యాక్షన్‌ః పీటర్ హెయిన్స్.