Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

తదుపరి స్పెక్ట్రం వేలంలో విశాల దృక్పథం

ట్రాయ్ నివేదిక కోసం ఎదురుచూస్తున్న టెలికామ్ శాఖ

Telcomన్యూఢిల్లీ: తదుపరి స్పెక్ట్రమ్ వేలం సమయం విషయంలో టెలికామ్ శాఖ విశాల దృక్పథంతో ఉందని, ఓ అభిప్రాయానికి వచ్చేలోగా టెలికామ్ రెగ్యులేటర్ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నివేదిక కోసం వేచిచూస్తోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. స్పెక్ట్రమ్ వేలం విషయంలో టెలికామ్‌లతో గత వారం ట్రాయ్ విస్తృతంగా చర్చలు జరిపింది. లాభాలు తగ్గిపోతున్న, అధిక పన్నుల నేపథ్యంలో ఒత్తిడికి గురవుతున్న అనేక టెలికామ్ కంపెనీలు వేలాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బాండ్స్ తర్వాత ఎక్కువగా కోరుకునే రేడియోవేవ్స్‌కు డిమాండ్ పెరిగింది. వీటి కోసం అనేక టెలికామ్‌లు వేలంలో పాల్టొంటాయని టెలికామ్ సెక్రటరీ అరుణా సుందర రాజన్ తెలిపారు. ‘మేము ట్రాయ్ నివేదిక కోసం వేచి చూస్తాం. వారిచ్చే సిఫార్సులను అనుసరిస్తాం. వారు టెలికామ్ పరిశ్రమతో చర్చించాక మాకు ఏ విషయం చెబుతారు. ఎవరు ఏ మేరకు బ్యాండ్స్ కోరుతున్నారు. ఎంత మంది వేలంలో పాల్గొంటారు వంటివి వారు మాకు చెబుతారు. అందుకే ట్రాయ్ ఇచ్చే సమాచారం కోసం మేము వేచి ఉన్నాం ’ అని అరుణ తెలిపారు. ఇదిలా ఉండగా సిఫార్సులను వీలయినంత త్వరగా ఇస్తామని ట్రాయ్ ఛైర్మన్ ఆర్.ఎస్. శర్మ తెలిపారు. తదుపరి స్పెక్ట్రం వేలం ఎప్పుడన్నది ఇంకా నిర్ధారించలేదు. ఇదివరలో 2016లో స్పెక్ట్రం వేలం జరిగింది. అందులో రూ. 5.6 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేయగా రూ. 65,789 కోట్ల మేరకే రేడియోవేవ్స్ అమ్ముడుపోయాయి.
4జి బ్యాండ్లు సహా 60 శాతం రేడియోవేవ్స్ అమ్ముడుకాలేదు. తదుపరి స్పెక్ట్రం వేలంలో 700, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగాహెడ్జ్‌లు అంతకు మించిన బ్యాండ్లు వేలం వేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక గడ్డు పరిస్థితిలో వేలం సమయ నిర్ధారణ విషయంలో విశాల దృక్పథంతో వ్యవహరించాలని అనేక టెలికామ్ కంపెనీలు చర్చల సందర్భంగా ట్రాయ్‌కు విన్నవించుకున్నాయి. వేలంలో పాల్గొనేందుకు వీలుగా రిజర్వు ధరలను కూడా తగ్గించాలని కోరాయి.

Comments

comments