Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

రైతుల కళ్లల్లో ఆనందమే నాజీవిత లక్ష్యం

sand

* పెద్దమనస్సుతో భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు..
* పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ పనులను నిర్ణీత సమయాని
కంటే ముందే పూర్తి చేస్తాం:సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

మన తెలంగాణ/పెద్దమందడి:నిరంతరాయం గా కాల్వల నిర్మాణం చేపట్టి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించి రైతుల కళ్లల్లో ఆనందం వారి పొలాల్లో సాగునీరు చూడటమే తన జీవిత లక్షమని రాష్ట్ర ప్రణాళి కా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శని వారం మండల పరిధిలోని బలిజపల్లి గ్రామంలో ఏర్పాటు చేసి న పల్లెనిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని గ్రామంలో బస చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజ ల సమస్యలను అడిగి  తెలుసుకున్నారు .ఆదివారం ఉదయం బలిజప ల్లి జంగమాయపల్లి జంట గ్రామాల్లో పర్యటిం చిన ఆయన నేరుగా ప్రజల వద్దకు వెళ్లి మాట్లా డారు. అనంతరం బుద్దారం చెర్వు నుండి పెద్ద మందడి బ్రాంచ్ కెనాల్ ద్వారా 21 వేల ఎక రాలకు సాగునీరందించే కాల్వ పనులను స్థాని క నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కాలి నడకన వెళ్లి పరిశీలించారు. గత నెల 29వ తేదీన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు ప్రారంభించిన పనులను కాంట్రా క్టర్ మేఘారెడ్డి యుద్ద ప్రాతిపదికన నిర్వహి స్తుండడంపై నిరంజన్‌రెడ్డి ఆయనను అభినం దించారు. రాత్రింబవళ్లు నిరంతరాయంగా ప నులను చేపట్టి నిర్ణీత సమయం కంటే పను లను ముందే పూర్తి చేసి సాగునీరుఅందిస్తామ ని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పెద్దమనస్సుతో భూములిచ్చిన
రైతులకు ధన్యవాదాలు..
బుద్దారం చెర్వు నుండి సాగునీరు తెచ్చేందుకు కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపో యిన వారు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎలాగైనా తీసుకుం టామన్న నమ్మకంతో భూములిచ్చి గ్రామాల అభివృద్ధిలో పెద్దమనస్సుతో భాగస్వాములైన రైతులందరికి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలి పారు. ఈసందర్భంగా రైతులు రామేశ్వర్‌రెడ్డి ,జగన్మోహన్‌రెడ్డిలను శాలువాతో సన్మానించి అభినందించారు.
టిఆర్‌ఎస్‌లో చేరిన వంద మంది
గౌడ సంఘం నాయకులు..
పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా బలిజపల్లి జంగమాయపల్లి గ్రామాలకు వచ్చిన నిరంజ న్‌రెడ్డి సమక్షంలో ఆయా గ్రామాలకు చెందిన సుమారు వంద మంది గౌడ సంఘం నాయకు లు నిరంజన్‌రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చే రారు. గౌడ సంఘం కమ్యూనిటీ హాల్ కోసం రూ.5లక్షలు మంజూరు చేయాలని వారు ని రంజన్‌రెడ్డిని కోరగా తక్షణమే స్పంధించిన ఆయన జూన్‌లో మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అలాగే గ్రామానికి చెందిన మాజి ఉపసర్పంచ్ కృష్ణాజీ టిడిపి నుండి టిఆర్‌ఎస్‌లో చేరారు.
బిసి కమ్యూనిటి హాల్‌కు భూమి పూజ..
గ్రామంలోని బిసి కమ్యూనిటి హాల్ నిర్మాణాని కి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి భూమి పూజ చేశారు.
రూ.5 లక్షలు మంజూరు చేసిన ఆయ న ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రా రంభించారు. భవన నిర్మాణం నాణ్యవంతంగా చేపట్టాలని,అవసరమైతే మరిన్ని నిధులు మం జూరు చేస్తానని ఆయన వారికి హామి ఇచ్చా రు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ, ఎంపిపి దయాకర్, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు మేఘారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షులు విట్టా శ్రీనివాస్‌రెడ్డి, మాజి జడ్పిటిసి జగదీశ్వర్‌రెడ్డి, శశివర్ధన్‌రెడ్డి, సత్యశీలారెడ్డి, జగదీశ్వర్ రావు, గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం డైరెక్టర్ నాగేంద్రం యాదవ్, శివశంకర్,కమ లాబాయి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments