Home జోగులాంబ గద్వాల్ ‘బడి’ కి వేళాయెరా…

‘బడి’ కి వేళాయెరా…

The number of children outside the obscure school

జోగులాంబ జిల్లాల్లో బాలకార్మికులెందరో…?
అస్పష్టంగా బడిబయట పిల్లల సంఖ్య
అధికారులు, స్వచ్ఛంద సంస్థల లెక్కలపై భారీ వ్యత్యాసం
ఏటా మొక్కుబడిగా బడిబాట
జూన్ 4వ తేదీ నుంచి 5రోజుల పాటు బడిబాట కార్యక్రమం

మన తెలంగాణ/గద్వాలప్రతినిధి: “జోగులాంబ గద్వాల జిల్లాల్లో గట్టు మ ండలం అక్షరాస్యతలో ఆసియాలోనే అట్టడుగు స్థానంలో ఉంది. ఈప్రాంతంలో నివసించే చాలా కుటుంబాలు ఉపాధి కో సం కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు పొట్టచేత పట్టుకుని వలస వెళ్లే దయనీయ దృశ్యాలు నిత్యకృత్యంగా అగుపిస్తాయి… దీంతో చాలా మంది బడిఈడు పిల్లలు చ దువును మధ్యలోనే మానేసి వివిధ చోట్ల పనులు చేస్తూ బాలకార్మికులుగా మారిపోతున్నారు. ఒక పక్క ప్రభుత్వాలు బాలకార్మికుల వ్యవస్థను పూర్తిగా రూపుమాపాలనే సంకల్పం తో వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో లేకుండా పోతుంది.  ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 5రోజుల పాటు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యాశాఖాధికారులు నిర్ణయించారు. అయితే గతేడాది పదిరోజుల పాటు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తేనే చాలా మంది పిల్లలు బడులకు దూరంగా ఉండిపోయిన పరిస్థితి… ఇపుడు కేవలం 5రోజుల పాటు నిర్వహించే బడిబాట కార్యక్రమానికి ఎంత మేర సత్ఫలితాలు వస్తాయనేది అనుమానస్పదంగా మారింది. పైగా బాలకార్మికుల సంఖ్యపై ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చెబుతున్న సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉండడం కూడ బడిబాట కార్యక్రమం ప్రారంభానికి ముందే నీలినీడలు కమ్ముకున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాల్లో బడికి దూరంగా ఉన్న బాలకార్మికులపై మన తెలంగాణ ప్రత్యేక కథనం.. బాలకార్మికులే లక్షంగా…: జిల్లాల్లో మొత్తం 458 ప్ర భుత్వ పాఠశాలలున్నాయి. అధేవిధంగా మరో 12 క స్తూర్భా పాఠశాలున్నాయి. ఇక్కడ విద్యానభ్యసించే విద్యార్థుల సంఖ్య 73వేల మంది. అయితే ఈ లెక్కల వరకు బాగానే కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో బాలకార్మికుల పరిస్థితి పరిశీలిస్తే తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. వేల సంఖ్యలో పిల్లలు మధ్యలోనే బడిమానేసి పసివయసులోనే కుటుంబాల పోషణ బాధ్యతలను నెత్తినేసుకుని వివిధ రకాల వెట్టి చాకిరి చేస్తు విలువైన బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు.. మరి ప్రతి ఏటా ప్రభుత్వం పాఠశాలల పున:ప్రారంభం ముందు చేస్తున్న హడావిడి ఉత్తిదేనా..? అంటే కొంత వరకు అవుననే సమాధానం వినిపిస్తుంది. కేవలం ప్రభుత్వం చేపడుతున్న బడిబాట కార్యక్రమాన్ని మొక్కు‘బడి’ గా కానిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకసారి అధికారులు చెబుతున్న బాలకార్మికుల సంఖ్యను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. వాస్తవానికి ప్రభుత్వం చెబుతున్న బాలకార్మికుల సంఖ్య కేవలం1500వరకు ఉంటుందని.. కాని డ్రాపవుట్ సంఖ్య మాత్రం 12వేల వరకు ఉందని అధికారులే స్వయంగా చెబుతున్నారు.. మరోవైపు బాలకార్మికుల నిర్మూలన కోసం పనిచేస్తున్న కొన్ని స్వచ్ఛంధ సంస్థలు వెల్లడిస్తున్న బాలకార్మికుల సంఖ్య భారీ వ్యత్యాసాన్ని చూపెడుతున్నాయి. జిల్లాల్లో 12వేల పైచిలుకు బాలకార్మికులు వివిధ చోట్ల వెట్టిచాకిరి చేస్తున్నారనే ఫిర్యాదులు చేస్తున్నాయి. మరి ప్రభుత్వం చెబుతున్న సంఖ్య నిజమనుకోవాలా…? లేక స్వచ్ఛంధ సంస్థలు చెబుతున్నవి నిజమనుకోవాలా..? అంటే ఒకసారి గతేడాది అధికారులు చెప్పిన లెక్కలు పరిశీలిస్తే తెలుస్తుంది. గతేడాది మొత్తం 2842 మంది బాలకార్మికులున్నట్లు వారందరిని బడిలో చేర్పించినట్లు ప్రభుత్వ అధికారులు లెక్కలు వెల్లడించారు. కాని అందుకు భిన్నంగా ఎంవీఎస్ ఫౌండేషన్ స్వచ్ఛంధ సంస్థ 2900 మంది బాలకార్మికులను బడిలో చేర్పించినట్లు లెక్కలతో సహా వివరాలను వెల్లడించడం జరిగింది. ఇపుడు తాజాగా జూన్ 4వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ముఖ్యంగా బాలకార్మికులు, అనాథలు, బడిబయటపిల్లలు, అంగన్‌వాడీలలో ఉండే పిల్లలపై దృష్టి సారించినట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అ యితే గతేడాది 10రోజుల పాటు చేపట్టిన బడిబాట కా ర్యక్రమానికి స్పందన అంతంత మాత్రంగానే ఉం డగా…. ఈఎడాది కేవలం 5రోజుల పాటు బడిబాట కార్యక్రమాన్ని చేపడితే ఎంతవరకు సత్ఫలితాలు సాధిస్తారో… అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా… మరోసారి బడిబాట కార్యక్రమాన్ని మొక్కుబడిగా చేపట్టేందుకు సిద్ధమైయ్యారనే ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి.
అధికారి ఏమన్నారంటే…: జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు 5రోజుల పాటు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మేము నిర్వహించిన సర్వే లెక్కల ప్రకారం మొత్తం 1400 నుంచి 1500 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అధేవిధంగా బడికి వస్తూ డ్రాపవుట్లుగా ఉన్న పిల్లల సంఖ 12వేల మంది వరకు ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి పకడ్భందిగా ప్రతిఒక్క బడిఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగింది. అధేవిధంగా మండలాల విద్యాధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నామన్నారు. స్వచ్ఛంధ సం స్థలు చెబుతున్న సంఖ్యకు భారీ వ్యత్యాసానికి ఉన్న కా రణం గురించి స్పందిస్తూ వారికి మాకు తేడా ఉం టుంది.. మేము ఏచిన్న తప్పు చేసినా దొరికిపోతాం… మేము బాధ్యతతో కూడిన విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. వారికి(స్వచ్ఛంధ సంస్థలు) అటువంటిదేమి ఉండదంటూ మనతెలంగాణకు వివరించారు.