Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ట్రంప్ ఉత్తర్వుల నిలిపివేత ఓకే

షాక్ ఇచ్చిన మరో కోర్టు
సమీక్షలు కుదరవనే ధోరణిపై ఆగ్రహం
రాజ్యాంగ పరిరక్షణకే న్యాయ జోక్యం
Trumpశాన్ ఫ్రాన్స్‌న్సిస్కో : వలస నిషేధ ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు ట్రంప్‌నకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వీటి పునరుద్ధరణకు వీలు కల్పించాలనే అభ్యర్థనను అమెరికా అప్పీళ్ల కోర్టు శనివారం తోసిపుచ్చింది. ఏడు ముస్లిం దేశాల నుంచి ప్రజల ప్రవేశాన్ని నిరోధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు వెలువరించారు. అయితే ఇవి చెల్లనేరవని ఫెడరల్ న్యాయస్థానం వాటిని దేశవ్యాప్తంగా నిలుపుదల చేసింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఉగ్రవాద నిర్మూలనకు తాను తీసుకున్న చర్యలను తప్పుపట్టడం అనుచితం అని , ఈ ఏకగ్రీవ రూలింగ్‌ను కోర్టులోనే తేల్చుకుంటానని ప్రకటించారు. అయితే ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనలో ఔచిత్యం లేదని, అప్పీలులో సరైన అంశాలు పొందుపర్చలేదని తెలిపారు. అంతేకాకుండా ఆదేశాల నిలిపివేతతో కోలుకోలేని నష్టం కల్గినట్లుగా చూపలేకపోయిందని తొమ్మిదవ యుఎస్ సర్కూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్‌కు చెందిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. సియాటిల్ న్యాయస్థానం జారీ చేసిన తీర్పును తాము నిరోధించజాలమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏడు ముస్లిం దేశాల నుంచి కనీసం 120 రోజుల పాటు శరణార్థులు అమెరికాలోకి రాకుండా గత నెలలో ట్రంప్ విశేషాధికారాలతో కార్యనిర్వాహక ఉత్తర్వులను వెలువరించారు. కార్యనిర్వాహక ఆదేశాల జారీకి అవసరం ఉందని అవసరమైన ప్రాతిపదికను అధికార వర్గాలు పొందుపర్చలేదని ధర్మాసనం పేర్కొంది. కేవలం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానాలు సమీక్షించాల్సిన అవసరం లేదనే ధోరణితో అప్పీలు ఉందని, అంగీకరించేది లేదన్నారు.
ఇది రాజకీయ రూలింగ్: తమ ఆదేశాల పునరుద్ధరణకు అప్పీళ్ల కోర్టు నిరాకరణతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రూలింగ్ వెలువడిన వెంటనే విలేకరులతో మాట్లాడుతూ ఇది రాజకీయ దురుద్ధేశపూరిత నిర్ణయం అని వ్యాఖ్యానించారు. మరోసారి కోర్టులోనే దీనిపై తేల్చుకుంటామని, ప్రస్తుతానికి తమ నిర్ణయం కొంచెం వెనకకు పోయిందని, అయితే ఈ వ్యవహారంలో చివరికి తమదే గెలుపు అని ట్రంప్ దీమా వ్యక్తం చేశారు.కోర్టులు రాజకీయాలకు దిగుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. అప్పీళ్ల కోర్టులో కూడా ట్రంప్‌నకు మరోసారి చుక్కెదురు కావడం పట్ల ఆయన రాజకీయ ప్రత్యర్థులు, హక్కుల ఉద్యమకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

comments