Home ఆఫ్ బీట్ పోషకాల గని నారింజ

పోషకాల గని నారింజ

 The orange fruits strengthen the body
మన తెలంగాణ / ఆర్మూర్: పచ్చని రంగుతో మెరిసిపోయే నారింజ పండ్లు నోరు ఊరిస్తాయి. జీర్ణ సమస్యల నుంచి క్యాన్సర్ల వరకు, సాధరణ ఇన్‌ఫెక్షన్ నుంచి డయాబెటిస్ వరకు నివారించని జబ్బు లేదంటే అతిశయోక్తి కాదు. పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా వుండే కమ్మని నారింజ ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో పులుపు, తీపిగా వుండే వివిధ రకాల నారింజలు కూడా ఉన్నాయి. పుల్లని పండ్లలో నీరు అధికంగా లవణాలు తక్కువగా ఉంటాయి. తీపి నారింజలో నీరు తక్కువగా ఉండి లవణాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే తీపి నారింజనే తీసుకోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
నారింజ పండ్లలో ప్రయోజనాలు
నారింజ పండ్లు శరీరానికి బలాన్నిస్తాయి. మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చూస్తాయి. జ్వరాల బారిన పడినప్పుడు నారిజను తింటే జీర్ణ సమస్య తగ్గడమే కాక శక్తినిస్తుంది. ఆహార నాళంలో క్రిములు చేరకుండా నిరోధిస్తాయి. వీటిలోని బీటా కెరోటిన్ శరీరంలో కణాజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల దృఢత్వానికీ ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుద్ధ్ది చేయడంలో, రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూడటంలో నారింజ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో పాటు గుండె పనితీరు కూడా మెరుగు పడుతుంది. విటమిన్లు (సి) ఎక్కువ ఉండటంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలు దరి చేరవు. గర్భిణులు నిత్యం నారింజ పండ్లు తీసుకుంటే ఫోలిక్ యాసిడ్ లోపం రాకుండా చూడవచ్చు. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఆస్తమా, టి.బీ వంటి వాటితో బాధపడే వారికి నారింజ పండ్లు చక్కని ఉపశమాని ఇస్తాయి. నారింజను జ్యూస్ చేసుకోని తాగితే కిడ్నిలో రాళ్ళు రాకుండ నిరోధించవచ్చు. మెదుడుకు ఉల్లాసాని, ఉత్తేజాన్ని ఇచ్చే గుణం నారింజలో వుంది. రోజుకు రెండు గ్లాసుల నారింజ రసం తాగితే రక్తపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. మలబద్దకాన్ని కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పలురకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు వీటిలో ఉన్నాయి. క్షయ లాంటి జబ్బులు ఉన్నవాళ్లు ఈ పండ్లు తింటే ఇమ్యునిటినీ పెంచి వ్యాధి త్వరగా తగ్గేందుకు దోహదం చేస్తాయి. ఆస్తమా వంటి అలర్జీ సంబంధిత సమస్యలకు కూడా ఈ పండ్లు మందులా పనిచేస్తాయి.