Home నిర్మల్ సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి అల్లోల

సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి అల్లోల

MINISTR

నిర్మల్‌అర్బన్ : రాష్ట్రంలో ప్రజలందరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడమే ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర గృహనిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యా,వైద్యం పై కోట్లాది రూపాయిలు వెచ్చిస్తుందన్నారు.ప్రజలందరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు.విద్యార్థుల ఉజ్జల భవిష్యత్‌కు ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించబోతున్నట్లు పేర్కొన్నారు.అనంతరం జిల్లా వైద్యాధికారి జలపతినాయక్ మాట్లాడుతూ దేశంలో 50,60 శాతం మంది 1-19 సం॥ పిల్లలు నులిపురుగులకు గురై అనారోగ్యం పాలవుతున్నారన్నారు.నులిపురుగుల వ్యాధి నిర్మూలించడానికి జిల్లాలో 876 అంగన్‌వాడీ ,కళాశాలలో 215 మందికి ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్‌చక్రవర్తి,ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి,పిఎసిఎస్ చైర్మన్ జీవన్‌రెడ్డి,ఆర్డీఒ ప్రసునాంబ,డా॥రాము,సురేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.