Search
Sunday 23 September 2018
  • :
  • :

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

The person who is irritated is suicidal

మణుగూరు రూరల్: మండల పరిధిలోని రామాంజవరం గ్రామంలో అయోధ్యనగర్ వెళ్లే దారిలో చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. సిఐ కొందు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… రామంజవరం గ్రామానికి చెందిన కత్తుల సతీష్ (45) రోజు వారి కూలీ చేసుకునే వాడు. త్రాగుడుకి బానిసై బాగా త్రాగి తిరుగుతుండేవాడు. త్రాగుడు మానుకోవాలని కుటుంబ సభ్యులు ఎన్ని సార్లు సముదాయుంచిన వినకుండా ఆదే తీరు వ్యహరించేవాడు. ఈ క్రమంలో కుటుంబికులతో కాస్త వాగ్వావాదం చోటు చేసుకుంది. మనస్తాపానికి గురైన సతీష్ శుక్రవారం అయోధ్యనగర్ సమీపంలో ఉన్న కాలి స్థలంలోని వేప చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. సుమారు ఉదయం 9: 00 గంటలకు ఉరేసుకొని ఉండవచ్చని పోలీసుల అంచనా. గమనించిన కొందరు కుటుంబికులకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు మృదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబికులకు అందచేశారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఉప్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సిఐ తెలిపారు.

Comments

comments