Home మహబూబ్‌నగర్ కయ్యాల కాంగ్రెస్

కయ్యాల కాంగ్రెస్

The pink squad is sharpened for political strategy

రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్న గులాబీ దళం
చల్లారని జైపాల్ డికె విబేధాలు
కాంగ్రెస్ కోటలపై టిఆర్‌ఎస్ జెండాలు

మన తెలంగాణ/ మహబూబ్‌నగర్: అధికార పార్టీ దూకుడు పెంచనుంది. ఇప్పటికే ఊహకందని విధంగా ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో వినూత్న కార్య్ర కమాలకు శ్రీకారం చుడుత్నున టిఆర్‌ఎస్ ప్రభుత్వం, అదే ఊపుతో పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతోంది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌లో ఉన్న విభేధాలను తనకు అనుకూలంగా మార్చుకునేందకు రాజకీయ వ్యూహం రచిస్తోంది. కాంగ్రెస్ కలహాలను తమ వైపు తిప్పుకునేందుకు గులాబి దళం పదును పెడుతోంది. చాపకింద నీరులా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తులు తీవ్రం చే స్తోంది. రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికలలోగా ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గులాబి జండా ఎగురవేయాలన్న కసితో రాజకీయ సెగను పెంచుతోంది. ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, దేవరకద్ర, నియోజకవర్గాలను కైవసం చేసుకోగా, టిడిపి కొడంగల్, నారాయణపేట, నియోజకవర్గాలో గెలిచింది. అలాగే కాంగ్రెస్ గద్వాల, ఆలంపూర్, వనపర్తి, కల్వకుర్తి, మఖ్తల్ నియోజకవర్గాల్లో గెలిచింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేఫథ్యంలో కాంగ్రెస్   నుంచి మఖ్తల్ ఎమ్మెల్యె చిట్లెం రాంమ్మోహన్‌రెడ్డి, టిడిపి నుంచి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చేరడంతో టిఆర్‌ఎస్ బలం 9 కి చేరింది. అనంతరం కారు ఆపరేషన్‌కు అనేక మంది ఇతర పార్టీ నేతలు గులాబి దళంలోకి చేరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరు జిల్లాపై ముఖ్యమంత్రి ్రప్రత్యేక శ్రద్ద తీసుకొని అభివృద్దికి బాటలు వేశారు. సిఎం మానస పుత్రిక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పనులు ఆగలేదు.ప్రస్తుతం పనులు శరవేగంగా జరగుతున్నాయి. భీమా ,నెట్టెం పాడు,కోయిల్‌సాగర్,కల్వకుర్తి, వంటి అనేక ప్రాజెక్టుల విషయంలో సిఎం ప్రత్యేక శ్రద్ద తీసుకొని పూర్తి చేశారు. అదనంగా ప్రస్తుతం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, గట్టు ఎత్తిపోతల పథకాలకు కూడా శ్రీకారం చుట్టబోతున్నారు.ఆ నాలుగు సంవత్సరాల్లో సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో ఉమ్మడి జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందింది. గతంలో నిత్యం ఎడారి,వలసలకు నిలయంగా మారిన జిల్లా ఈ ఏడాదిలో భూగర్భ జలాలు పెరుగుదలతో పాటు ఆయికట్టు స్థీరీకరణ పెరిగింది.మరో వైపు మిషన్ బగీరథ పనులు కూడా 80 శాతం పూర్తి అయ్యాయి. ఇప్పడు రైతు బంధు, రైతు భీమాతో పాటు ఇతరత్రా అభివృద్ది పనులతో జిల్లాలో గులాబి పార్టీ ప్రజల్లో చొచ్చుకుపోతోంది.

కాంగ్రెస్ కలహాలే గులాబికి శ్రీరామ రక్షః
కాంగ్రెస్‌లో ఉన్న కలహాలే టిఆర్‌ఎస్ పార్టీకీ శ్రీరామ రక్షగా మారుతోంది. కాంగ్రెస్‌లో రోజు రోజుకు రాజుకుంటున్న రాజకీయ విభేధాలతో ప్రజల్లో కాంగ్రెస్‌పై చులకన భావం ఏర్పడుతోంది. నేతల మధ్య సయోధ్య లేక పోవడం, సీట్ల కోసం ఇప్పటి నుంచే ఎవరికి వారు పైరవీలు షురూ చేసుకుంటుండడంతో విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సీనియర్ నేత డికె అరుణల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్ధితులు ఉన్నాయి.నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో డికె అరుణ తీవ్ర అసంతృప్తితో రగులుతున్నారు.తాను మొదటి నుంచి నాగం రాకను వ్యతిరేకిస్తున్నప్పటికీ జైపాల్ రెడ్డి నాగంను తీసుకురావడంతో డికె అరుణ ఆగ్రహంతో ఉన్నారు.తన అనుచరుడు ఎంఎల్‌సి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి నాగం చేరికను వ్యతిరికిస్తూ టిఆర్‌ఎస్‌లోకి చేరడంతో నాగర్‌కర్నూల్‌లో టిఆర్‌ఎస్ పార్టీ మరింత బలపడింది. ఇక వచ్చే ఎన్నికల్లో మర్రి జనార్దన్‌రెడ్డి విజయం సులభంగా గెలుస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లాపై డికె అరుణ మొదటి నుంచి తన మార్కు రాజకీయాన్ని నడిపిస్తూ వస్తోంది. తన అనుచరులకు ఎక్కడా అన్యాయం జరగకుండా కాపాడుకుంటూ వస్తోంది. ఇటీవల పరిణామాలు ఆమెను కలతకు గురి చేస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలోనూ పార్టీని కాపాడుకుంటూ వస్తే తనపైనే సొంత పార్టీలోనే రాజకీయ కుట్ర జరగడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోతున్నారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో రాజకీయ విబేధాలతో కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ తనకు అనుకూలంగ మార్చుకునేందుకు రాజకీయంగా దూకుడు పెంచ బోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లోని పెద్ద తలలను టిఆర్‌ఎస్‌లో చేర్చే వ్యూహాన్ని రచించినట్లు సమాచారం.భవిష్యత్‌లో ఉన్నత రాజకీయ భవిష్యత్‌తో పాటు అన్ని విధాల అండగా ఉండేలా ఆ పార్టీ నేతలకు గాలం వేస్తోంది. ఇప్పటికే అలంపూర్ నియోజకవర్గంలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అబ్రహాం టిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీకి అక్కడ అదనపు బలం పెరిగింది.అబ్రహాంకు రాజకీయ అనుభవంతో పాటు, మచ్చలేని నేతగా ఉన్నారు.ఇలా కాంగ్రెస్‌లో కోటల్లోని ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలోకి తీసుకురానున్నారు. కల్వకుర్తి, గద్వాల,అలంపూర్, కొడంగల్‌లో భవిష్యత్‌లో గులాబి జెండాను ఎగుర వేసే ప్రయత్నాలను గులాబి దళాల నేతలు ప్రయత్నాలు మమ్మురం చేస్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ కలహాలు టిఆర్‌ఎస్‌కు లాభం తెచ్చే అవకాశాలు ఉన్నాయి.
నోట్ ః టిఆర్‌ఎస్ సిఎం కెసిఆర్, డికె. అరుణ, జైపాల్‌రెడ్డి ల ఫోటోలు వాడుకోగలరు.