Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

త్రయం జోరు తగ్గింది…

Gayle-AB-Watson

మన తెలంగాణ / క్రీడావిభాగం : ప్రపంచంలోనే అత్యంత విధ్వంసక బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన క్రిస్ గేల్ (వెస్టిండీస్), (దక్షిణాఫ్రికా), షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)లు ఐపిఎల్‌లో చెత్త ఆటతో అభిమా నులను నిరాశ పరిచారు. ఒక ప్పుడూ ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ త్రయం పదో సీజన్‌లో మాములు ఆట గాళ్లకంటే కూడా అధ్వా న్నంగా బ్యాటింగ్ కనబరిచారు. వీరి చెత్త ఆట ప్రభావం రాయ ల్ చాలెంజర్స్ బెంగ ళూరుపై తీవ్రంగానే పడింది. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు పదింటిలో పరాజయాలు చవిచూసింది. కిందటి సీజన్‌లో బెంగ ళూరు రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సారి జట్టు భారీ ఆశలతో బరిలోకి దిగింది. హేమాహేమీలతో కూడిన బెంగళూరు ఈసారి కూడా ప్లేఆఫ్‌కు సునాయాసంగా చేరుకుంటుందని విశ్లేష కులు అంచన వేశారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ రాయల్స్ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకుంది.

కనిపించని గేల్‌ మెరుపులు..

ఒకప్పుడు బరిలోకి దిగాడంటే చాలు ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే క్రిస్ గేల్ ఈసారి ఘోర వైఫల్యం చవి చూశాడు. హైదరాబాద్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో మెరవడంతో ఈసారి కూడా గేల్‌తో ప్రత్యర్థి బౌలర్లకు కష్టలు తప్పవని అందరు భావించారు. అయితే ఈ అంచనాలు చాలా తప్పని తర్వాతి మ్యాచ్ నుంచే తేలిపోయింది. చెత్త బ్యాటింగ్‌తో గేల్ అభిమానులను నిరాశ పరిచాడు. కీలక సమయాల్లో జట్టుకు అండగా నిలిచే గేల్ ఈసారి పూర్తిగా విఫలమయ్యాడు. ఏ మ్యాచ్‌లోనూ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయాడు. సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన గేల్ కేవలం 153 పరుగులు మాత్రమే సాధించాడు. అంతేగాక ప్రతిసారి టాప్-10లో నిలిచే గేల్ ఈసారి పరుగుల సాధనలో 43వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

జోరు తగ్గిన డివిలియర్స్..

ఇక, దక్షిణాఫ్రికా దిగ్గజం ఎబి.డివిలియర్స్ కూడా ఈ సీజన్‌లో అభిమానులకు నిరాశే మిగిల్చాడు. విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన డివిలియర్స్ ఈసారి తన స్థాయికి ఆటను కనబరచడంలో విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టును వెంటాడింది. ఒంటిచేత్తో మ్యాచ్ దిశను మార్చే డివిలియర్స్ ఒకటి రెండు మ్యాచుల్లో మాత్రమే కాస్త రాణించాడు. కిందటి సీజన్‌లో ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించిన డివిలియర్స్ ఈసారి సత్తా చాటలేక పోయాడు. 9 మ్యాచుల్లో కేవలం 216 పరుగులు మాత్రమే సాధించాడు. అంతేగాక ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 32వ స్థానానికి పడిపోయాడు.

చెత్త ఆటతో…

మరోవైపు ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరొందిన షేన్ వాట్సన్‌కు ఈ ఐపిఎల్ సీజన్ ఓ పీడకలగా మారిందని చెప్పవచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. అతని వైఫల్యం బెంగళూరుపై తీవ్రంగానే పడింది. తనదైన రోజు ఎంతటి జట్టుకైన చుక్కలు చూపించే వాట్సన్ ఈసారి పూర్తిగా చేతులెత్తేశాడు. అతనిపై జట్టు ఎన్నో ఆశలు పెట్టుకోగా వాట్సన్ దాన్ని నీరుగార్చాడు. ఏడు మ్యాచ్‌లు ఆడి కేవలం 67 పరుగులు మాత్రమే చేసి 59వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. బౌలింగ్‌లోనూ ఘోర వైఫల్యం చవిచూశాడు. ఇలా, ముగ్గురు దిగ్గజాల వైఫల్యం బెంగళూరు విజయవకాశాలను పూర్తిగా దెబ్బతీసింది. దీంతో రాయల్స్‌కు అట్టడుగు స్థానం తప్పలేదు.

Comments

comments