Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

పోలీస్ శాఖలో దుమారం

the-police-department-is-a-disaster

అధికారుల కోసం సిబ్బంది త్యాగం
ఓ పైస్థాయి అధికారిపై అవినీతి ఆరోపణలు

మన తెలంగాణ / ఆదిలాబాద్ బ్యూరో : గత మూడు రోజుల నుండి పోలీస్ శాఖలో కొనసాగుతున్న దుమారం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. కొంత మంది పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు పై అధికారుల పేర్లు చెప్పి మా ముళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలపై ఆ శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. వెంటనే స్థానికంగా ఇంటలిజెన్స్ వర్గాలనే కాకుండా ప్రత్యేక ఇంటలిజెన్స్ విభాగాన్ని రంగంలోకి దించి అక్రమార్కులపై విచారణకు ఆదేశించింది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటలిజెన్స్ అధికారులు రహస్య విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ల వారీగా ఆరోపణలు ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్ల వివరాలను సేకరించారు. అయితే ఇంటలిజెన్స్ అధికారులు అక్రమార్కులపై వారి వివరాలతో కూడిన జాబితాను రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ నివేదికను ముఖ్యమంత్రికి సైతం అందించారు. అయితే ఉన్నతాధికారులు ఈ జాబితాపై ఆశించిన రీతిలోనే స్పందించి చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు ఆరోపణల జాబితాలో పేరున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులకు వెం టనే తప్పించాలని డిజిపి జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లా స్థా యి అధికారులు దీనిపై చర్యలు మొదలుపెట్టారు. అయితే నాణానికి రెండు వైపుల విధంగా అక్రమాల వ్యవహారంలో ఈ ఘట్టం తంతుగా పే ర్కొంటున్నారు. వాస్తవానికి కింది స్థాయి కానిస్టేబుళ్లు, హోంగార్డులు పై స్థాయి అధికారులకు లంచాల కోసం వారధులుగా వ్యవహరిస్తున్నరన్న ఫిర్యాదులు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. అధికారుల కనుసైగల మేరకే పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డులు లంచాల వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారన్న ఫిర్యాదులు తలెత్తుతున్నాయి. అయితే పై స్థాయి అధికారులను వదిలిపెట్టి కిందిస్థాయి సిబ్బందిని లక్షంగా చేసుకోవడం వెనుక ఆ శాఖ ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమాయకులైన కానిస్టేబుళ్లు, హోంగార్డులను అడ్డం పెట్టుకొని ఉన్నతాధికారులు తమ వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ ఉన్నతాధికారి

Comments

comments