Home తాజా వార్తలు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం

రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం

RAINSహైదరాబాద్ : రుతుపవనాల కారణంగా తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ, విదర్భ సరిహద్దుల్లో ఉపరితల ఆవర్తనం ఉండడంతో ఆదిలాబాద్, నిజామాబాద్,మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వారు వెల్లడించారు.