Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి

Pregnant died roots healing

నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చికిత్స కోసం వచ్చిన నిండు గర్భిణికి సరియైన చికిత్స అందకపోవడంతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో సత్యసాయి నర్సింగ్ హోం యజమాని, వనపర్తి జిల్లా డిఎంఆండ్‌హెచ్‌వొ డాక్టర్ శ్రీనివాసులు ఆసుపత్రిలో గురువారం రాత్రి నిండు గర్భిణికి వైద్యం అందక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బిజినపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన పద్మ(30) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్లితే… గర్భవతిగా ఉన్న రోజు నుంచి ఆయన వద్దే చికిత్స చేయించుకుంటుంది. బుధవారం అనారోగ్యంతో బాధ పడుతున్న పద్మను భర్త కుర్వ శివశంకర్ ఆసుపత్రికి తెచ్చారు. గురువారం సాయంత్రం వరకు చికిత్స నిర్వహించి సాయంత్రం హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నాయని మహబూబ్‌నగర్‌కు తీసుకుపోవాల్సిందిగా సూచించారు. దీంతో బందువులు ఆసుపత్రికి తీసుకుపోతుండగా మార్గమద్యలో మృతి చెందింది. దీంతో బందువులు పద్మ మృత దేహన్ని ఆసుపత్రికి తీసుకువచ్చి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట బందువులు ఆందోళన చేశారు. గత కొంత కాలం క్రితమే భర్త శివశంకర్‌కు గుండే ఆపరేషన్ అయ్యిందని బందువులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దీంతో చిన్నారులు దిక్కు లేనివారుగా మారరని పద్మ మృతికి ఆసుపత్రి వర్గాలే కారణమని బందువులు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు తెలపడంతో బిజినపల్లి ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, నాగర్‌కర్నూల్ ఎస్‌ఐ భగవంత్‌రెడ్డిలు ఆసుపత్రికి చేరుకొని బందువులకు నచ్చచెప్పి ఆందోళన సద్దుమనిగేల చెశారు. మృతురాలి కుటుంబానికి తమ వంతు న్యాయం చేస్తామని డాక్టర్ తెలిపారు.

Comments

comments