Home సినిమా టాలీవుడ్ పరువు తీసేశారు : తమిళ నటి

టాలీవుడ్ పరువు తీసేశారు : తమిళ నటి

Shriya-Reddy

హైదరాబాద్ : టాలీవుడ్ పై ప్రముఖ తమిళ నటి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాల కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖ నటీనటులు, దర్శకులు పట్టుబడిన అంశం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. కాగా తాజాగా ఈ వార్తపై కోలీవుడ్ నటుడు విశాల్ సరసన ‘పొగరు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి శ్రియా రెడ్డి స్పందించారు. సినీ నటులు సాంకేతిక నిపుణులు మాదకద్రవ్యాలకు అలవాటు పడి టాలీవుడ్ పరువు తీసేశారని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ బొమ్మల దుకాణం ప్రారంభించిడానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ మాఫియాలో ఎంతో మంది చిక్కుకోవడం దురదృష్టకరమని అన్నారు. డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు త్వరగా ఈ వ్యవహారం నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.