Home లైఫ్ స్టైల్ స్కిల్ లేకుంటే హెల్!

స్కిల్ లేకుంటే హెల్!

Students-class

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే విద్యార్థులు చాలామంది ఎదుర్కొరే ప్రధాన సమస్య ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌పై పట్టులేకపోవడం. అత్యధిక సంఖ్యలో ఇంజనీరింగ్ విద్యలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులున్నారు. ఉన్నత విద్యలో ప్రవేశించటానికి అవసరమైన తెలివితేటలు వారికి ఉన్నప్పటికీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సమర్ధతలో వెనుకబడిఉన్నారు. అందువల్ల విద్యాభ్యాసంలోను, వృత్తి నిర్వహణలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యను అభ్యసించాలన్నా, క్యాంపస్ ఇంటర్వ్యూలలోను విజయం సాధించాలంటే జి.డి జామ్
లు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌లో ప్రావీణ్యం సాధించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు,విద్యార్థులు టీచింగ్, లెర్నింగ్ విధానాలతో ప్రశ్నలు సమాధానాల సమావేశాలు, భాషా ప్రయోగసెషన్స్, ఇనీషియేటివ్తో కలసి చురుగ్గా నిర్వహించాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తూంటే త్వరలోనే ఆంగ్లంపై పట్టుసాధించగలుగుతారు.

అంతర్జాతీయ వ్యాపార,సాంకేతికత టెక్నాలజీ, ఏవియేషన్, డిప్లమసి,బ్యాంకింగ్,కంప్యూటింగ్,మెడిసిన్,ఇంజినీరింగ్, టూరిజం ప్రస్తుతం ఇంగ్లీష్ లింగా ఫ్రాoకాగా పరిగణిoచబడుతుంది. ప్రపంచంలో అయిదవ వంతు ప్రజలకు ఈ భాష పరిచితం. ప్రపంచంలో 1.8 బిలియన్ ప్రజలు ఇంగ్లీష్ మాట్లా డగలరు. ఇంకా ఆ సంఖ్య పెరుగుతోంది. ప్రపంచoలో ఇంగ్లీష్ ప్రధానపాత్ర వహిస్తోంది.అలెగ్జాoడర్ వి.సాoడోవల్ తన వ్యాసం ‘ఇంగ్లీష్ ప్రాధ్యానత’లో రాసిన దానితో ప్రపంచమంతా ఒప్పుకొంటోoది. 21వ శతాబ్దంలో ఇంగ్లీష్ ప్రపంచ భాషగా గుర్తింపు పొoదుతోoది. ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి ఇంగ్లీష్ మాట్లాడడం తెలుసు. 80 శాతం పైగా సమాచారం ప్రపంచంలో ఇంగ్లీష్ రాసింది లేదా అనువాదమై ఉంటుంది. ఇతర భాషా నైపుణ్యం,వర్క్ ,స్కూల్, వెకేషన్, వృత్తినిర్మాణం, వ్యాపారాభివృద్ధి అన్నిoటీకీ ఇంగ్లీష్ ఒక సాధనం. ఇంగ్లీష్ ధారళoగా మాట్లాడగలిగిన వ్యక్తి ప్రపంచంలో మనుషులున్నచోట తప్పిపోలేడు.

ఇంజనీంగ్ విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ప్రాముఖ్యత
ప్రపంచంలో ఇంజనీరింగ్’ పెద్ద అధ్యయన రంగం.విద్యా జీవనంలో ఇంజనీరింగ్విద్యార్థులను ఇంగ్లీష్ ఒక సాధనoగా ప్రత్యేకంగా ప్రభావితం చేస్తోంది. ఇంజనీరింగ్ లోని మొత్తం సిద్ధాoతాలన్నీ ఇంగ్లీష్ లోనే నేర్పుతుoడటo వల్ల మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సామర్ధ్యం అవసరమౌతోoది. ఇంజనీరింగ్ విద్యార్థులు అసoఖ్యాకoగా ఇంగ్లీష్లెక్చర్స్, ట్యుటోరియల్స్, ప్రయోగశాలలు, ప్రాజెక్ట్ రిపోర్టర్స్, పేపర్స్ఇంగ్లీష్ లోనే ఉంది. వివిధ యూనివర్సిటీలలోని ఇంజనీరింగ్ ప్రొఫెసర్లుఇంగ్లీష్ లోనే లెక్చర్లు ఇస్తారు. సమాచారాన్ని అత్యంత సౌకర్యవoతoగాఅందించే ఇంటర్నెట్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు వచ్చినతరువాత, ఒక వ్యక్తి ఆధ్వర్యంలో గ్రూప్‌లలో పనిచేయాలి. ప్రపంచంలో వివిధప్రాంతాలు, ప్రజలతో సహకారంగా, కమ్యూనికేటిoగ్ తో ఇంజనీర్లు పనిచేయవలసిఉంటుంది.అందరికీ ఇంగ్లీష్ వర్కింగ్ భాషగా ఉపయోగపడుతుంది.ఇంజనీర్లు తమ
సహచరులతో సమన్వయoతో పనిచేయాలంటే ధారాళoగా ఇంగ్లీష్ మాట్లాడాలి.ఈ విధoగాఇంజనీరింగ్ విద్యార్థులకు విద్యా,ఉద్యోగ జీవనంలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్సామర్ధ్యం ముఖ్యపాత్ర వహిస్తోంది.

గ్రామీణ ప్రాంతాలలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదురుకొంటున్నసమస్యలు
మన దేశంలో 75 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాంతీయ భాషల మీడియం స్కూల్స్నుంచి, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు.ఇంజనీరింగ్ కాలేజీలలో చేరిన వీరికి ఉన్నతవిద్యార్హత ,తెలివి మంచి భవిష్యత్తు కలిగి ఉన్నారు. కానీవారివృత్తి, ఉద్యోగాలలో అడుగడుగునా ఇంగ్లీష్ ప్రతిబoధకoగా ఉంది.ఈ విధంగాఇంగ్లీష్,ఈ నాగరిక ప్రపంచంలోకూడా గ్రామీణ విద్యార్థులకు పుల్లని ద్రాక్షకావటానికి కారణాలు పరిశీలిద్దాం.

కుటుంబ సాంఘిక,ఆర్ధిక నేపథ్యం క్లాస్ రూమ్‌లలో, సమాజంలోని విభిన్న స్థాయిల విద్యార్థులు గ్రహణశక్తి,ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సామర్ధ్యంలో తేడాలు కలిగి ఉంటారు. తక్కువమధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులు నిరక్షరాస్యులయితే, ఉన్నత మధ్యతరగతికుటుంబాల తల్లిదండ్రులు విద్యావంతులు కావటం వల్ల విద్యార్థుల ప్రతిభ సమానంగాఉండదు. చదువుకొన్న తల్లిదండ్రులకు,ఇంగ్లీష్ ఆవశ్యకత తెలియటంతో పిల్లలకు ఆ
భాషలో నైపుణ్యం కలగటనికి శ్రద్ధాసక్తులు చూపిస్తారు. విద్యావంతులుకావటంతో. తమ పిల్లల చదువు గురించి ఉపాధ్యాయులను సంప్రదించి ఇంటిదగ్గర శ్రద్ధతో మార్గదర్శకులుగా ఉంటారు. రెండోవ గ్రూప్ కు చెందిన విద్యార్థులకు ఆవిధమైన తల్లిదండ్రుల పర్యవేక్షణ,మార్గదర్శనం ఉన్నత విద్యలో లభించదు.

నిపుణులైన ఉపాధ్యాయుల కొరత విద్యావిధానంలో మరొక ప్రధాన అంశం నిపుణులైన టీచర్లు లేకపోవటం. చాలమందిటీచర్లు నేర్పే వివిధ స్థాయిలలో సరియైన శిక్షణ లేనివారై ఉన్నారు.ఇంగ్లీష్ భాషనేర్పటంలో(ఇఎల్ టీ) కొత్త పద్ధతులు ,అడ్వాన్స్‌డ్ మెలకువలు తెలియని
టీచర్లు ఉన్నారు. ప్రైమరీ ,సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూల్స్ లోను ,ప్రాంతీయభాష మీడియంగా ఉన్నా గ్రామీణ ,సెమిఅర్బన్ ప్రాంతాల విద్యాసంస్థలలో ఇదేపరిస్థితి కొనసాగుతోoది. నేర్పటం, నేర్చుకోవటం రెండు కేవలం పరీక్షల కోసమే.పరీక్షలు కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయి. తల్లిదండ్రులు కూడా నిపుణత ,జ్ఞానo కాకుండా మార్కుల కోసమే తాపత్రయపడుతుంటారు. టీచర్లు ,పిల్లలకు బట్టీ పద్ధతి అలవాటు చేయటంతో, పిల్లలకు ఇంగ్లీష్ భయంకరమైన దయ్యంలా కనపడుతుంది.సరియైన మార్గదర్శనం లేక ఈ దుస్థితి ఉన్నత విద్యలోకి వెళ్ళినా మనస్సులో ఉండిపోతుంది. మళ్లీ ఈ పరీక్షల మార్కులే లక్ష్యంగా,కమ్యూనికేషన్ సమర్ధత లేకుండా టెక్నికల్ సబ్జక్ట్స్ కే ప్రాధాన్యత ఇస్తారు.

విద్యావిధానం సంప్రదాయ విద్యావిధానం,ఇంగ్లీష్ నేర్చుకోవటానికి పట్టు సాధించటానికి ఉపయోగంగా లేదు. ప్రాథమికంగా వినటం, మాట్లాడటం , చదవటం, రాయటం ఈ నాలుగు (ఎల్ఎస్ ఆర్ డబ్ల్యూ) నిపుణతలు అవసరం. మనవిద్యార్థులు చాలాకాలం నుంచి వినటం, మాట్లాడటంలో నైపుణ్యం పొందటంలో నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు. చదవటం, రాయటంలో, మన విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.కాని
వినటం, మాట్లాడటం చాల ముఖ్యమైనవి. మాట్లాడటం సాధ్యమయ్యేటట్లు లెర్నింగ్ ప్రాథమిక నైపుణ్యంగా చేయగలదు. ఏ భాష అయినా నేర్చుకోవాలoటే చురుకుగా వినాలి. ఉదాహరణకు పిల్లలు మాట్లాడటం ప్రారంభిస్తారు. మన విద్య వినటం ప్రక్రియను ముఖ్యoగా నిర్లక్ష్యం చేయటం వల్ల మాట్లాడే నైపుణ్యం కోల్పోతున్నాo.ఆధునిక, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని భాషను నేర్చుకోవటంలో మనం ఉపయోగించకపోవటం వల్ల, భాషపై పట్టు సాధించటం , నేర్చుకోవటం దెబ్బతింటోంది. కంప్యూటర్, ఇంటర్నెట్, పవర్ పాయింట్ ప్రదర్శన ఇటు వంటి ప్రక్రియలు.

ఇంగ్లీష్ గ్రామర్ రెండవదిగా తలెత్తే వివాదం ఇంగ్లీష్‌ను సెకండ్ లాంగ్వేజ్‌గా నేర్చుకోవడంలో చాలా వివాదం ఉంది. పరిశోధకులు ఒక ప్రశ్న అడుగుతుంటారు. అదేమంటే మనం తల్లిభాష నేర్చుకొనేటప్పుడు వ్యాకరణం నేర్చుకుంటున్నామా? అందువల్ల గ్రామర్ కేవలం మార్కుల కోసమే నేర్చుకుంటున్నాం. గ్రామర్ భాష నేర్చుకోవడం కోసం సాధనం కాదు. దైనందిన భాషా వ్యవహారాలలో గ్రామర్‌ను మనం పట్టించుకోవడం లేదు.
ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాహాటంగా దృష్టి లేకపోవడం
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కుటుంబంలో, సంఘంలో , కాలేజీల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పట్ల బాహాటంగా ప్రదర్శించగల ప్రభావంలేదు. అందువల్ల స్వర్ణపతకాలు సాధించినా వ్యక్తిగత ఇంటర్వూలలో విఫలం చెందుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ , ఇంటర్ పర్సనల్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ లేకపోవడమే దీనికి కారణం. విద్యాభ్యాసంలో కూడా విశ్వాసం లేకపోవడంతో ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు. దానివల్ల తాను అందరికన్నా తక్కువన్న మానసిక భావనతో కొందరు ఒంటరి తనంతో దూరం అవుతున్నారు.

పరిష్కారాలు
గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సామర్థం ప్రాధాన్యత , డిమాండ్ పెరుగుతున్నందున టీచర్స్, స్టూడెంట్స్ కలిసికట్టుగా సంపూర్ణప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. -ఇంజినీరింగ్ విద్యాలయాలలోని ఫ్యాకల్టీ, అధ్యయన విభాగాలు వారు సాధించవలసిన బాధ్యతలను నెరవేర్చాలి. అంతేకాకుండా విద్యార్థులు కమ్యూనికేషన్ కాంపిటెన్స్ సాధించే నైతిక బాధ్యత తమదిగా భావించాలి. ఇంగ్లీష్ భాషపై విద్యార్థులు పట్టు సాధించే ప్రయత్నాలు కొనసాగించాలి.
విద్యార్థులు తమంతట తాము కమ్యునికేషన్ నైపుణ్యం సాధించవలసిందిగా ఒత్తిడి తీసుకురావడం వల్ల అసాధ్యం తప్ప ప్రయోజనం లేదు. విద్యార్థులకు సహాయం, ఆత్మీయత కలిగేటట్టు అవగాహన కల్పించాలి. ప్రస్తుతం మహారాష్ట్రలోని యూనివర్సిటీలలో రాయడం మాట్లాడటం పై నైపుణ్యం కలిగించే సమగ్రమైన కోర్సు ప్రవేశపెట్టారు.

టీచర్లు, విద్యార్థులు పరస్పరం ప్రభావితం చేసుకునే ప్రత్యేక సమావేశాలలో విద్యార్థులకు ప్రోత్సాహకరంగా సహాయం అందించాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సామర్థం పెరగడానికి అవసరమైన పేపర్ ప్రెజెంటేషన్, జి.డి. మాక్ ఇంటర్వూలు , రోల్ ప్లేలు వంటి కార్యక్రమాలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనేటట్లు ప్రోత్సహించాలి. టీచర్ టాక్ టైమ్( టిటిటి) కంటే స్టూడెంట్స్ సంభాషించే టైమ్ (ఎస్‌టిటి) ఎక్కువగా ఉండాలి.
సెకండరీ హయ్యర్ సెకండరీ స్థాయి విద్యార్థులకు వారి ప్రాంతీయ భాషలలో అర్థాలు ఉపయోగించుకోవడానికి అనువుగా నిఘంటువులు సమకూర్చాలి. ముఖ్యంగా సాంకేతిక పదాలకు ప్రాంతీయ భాషలలో పదాలు, మాటలు ఉండాలి. టెక్నికల్ టీచర్లు, ఇంగ్లీష్‌లో ఉన్న సాంకేతిక పదాలను , ప్రాంతీయ భాషలలో సమానార్థకాలుగా విద్యార్థులు అర్థం చేసుకోవడానికి వీలుగా సహాయం అందించాలి.
టెక్నికల్ సబ్జెక్‌లలో సుదీర్ఘమైన క్లిష్టమైన వాక్యాలు విద్యార్థులు అర్థం చేసుకొనేటట్టు సహాయం చేయాలి.
ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సాధించడానికి విద్యార్థులు తమంతట తాముగా ఇంగ్లీష్ జర్నల్స్, టివి ప్రోగ్రాంలు, వార్తాపత్రికలు, మేగజైన్‌లు, ఇతర ఇంగ్లీష్ భాషా సంబంధిత వనరుల కేంద్రాలను మరింత ఎక్కువగా ఉపయోగించుకోవాలి.

                                                                                                                                                                               కందాడై పర్సనాలిటి 
                                                                                                                                                                      8096829682