Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

బంజారాహిల్స్‌లో కొండచిలువ కలకలం

The python is Caused in the Banjara Hills

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 14  సినీ మ్యాక్స్‌ వెనక రోడ్డులో కొండచిలువ కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధాన రహదారిపై కనిపించిన ఆరడుగుల కొండచిలువను చూసిన జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి కొండచిలువ వెళ్లడం చూసిన స్థానికులు వెంటనే స్నేక్‌ ఆర్గనైజేషన్‌కు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న సంస్థ ప్రతినిధులు రాళ్లలో నక్కిన కొండచిలువను పట్టుకుని కెబిఆర్ పార్క్‌లో వదిలేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

comments