Home కెరీర్ ఇంజినీరింగ్ విద్య నాణ్యతకు కంపెనీలతో టైఅప్

ఇంజినీరింగ్ విద్య నాణ్యతకు కంపెనీలతో టైఅప్

AICTE-CHAIRMEN23త్వరలో దేశవ్యాప్తంగా ఒకే సిలబస్ జీవశాస్త్రంలోని ఇంజినీరింగ్, వృత్తివిద్య కళాశాలల్లో 50% సీట్లు మిగిలిపోతున్నాయి
మన తెలంగాణతో ఇంటర్వూలో ఎఐసిటిఇ ఛైర్మన్ సహస్రబుద్ధే
మన తెలంగాణ/ హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యలో సంస్కరణలకు ప్రయత్నాలు చేస్తు న్నామని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకే షన్ (ఎఐసిటిఇ) చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ దత్తాత్రేయ సహస్ర బుద్దే అన్నారు. దేశ వ్యాప్తంగా వృత్తి విద్య కాలేజీల్లో సగటున 50 శాతం సీట్లు భర్తీ కావడం లేదని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి కంపెనీల తో టైఆప్ ముఖ్యమన్నారు. బుద్దే హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ‘మన తెలంగాణ’ నిర్వహించిన ఇంట ర్యూలో పలు విషయాలను వెల్లడించారు.
ప్రశ్న : ఇంజినీరింగ్ విద్యలో ఎలాంటి మార్పులు చేయబోతున్నారు?
సహస్ర బుద్దే: ఇంజినీరింగ్ విద్యలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ దిశగా భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. దేశ వ్యాప్తంగా ఇంజినీరింగ్ సీట్లు మిగులు ఉండటంపై చర్చ జరుగుతోందన్నారు. విద్యార్థి, అధ్యాపకుల సగటు ను తగ్గించాలనే డిమాండ్ యాజమాన్యాల నుంచి ఉంది. దేశ వ్యాప్తంగా అర్హులైన అధ్యాపకుల కొరత ఉన్న మాట వాస్తవం. అనేక విషయాలపై జాతీయస్థాయిలో చర్చించి విద్యార్థులకు అనుకూలమైన విధానాలను తీసుకొస్తాం.
ప్రశ్న : విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా కాలేజీలకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కదా?
సహస్ర బుద్దే: దేశ వ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మా కాలేజీలు ఎనిమిది వేల వరకు ఉన్నాయి. కొత్త కాలేజీకి అనుమతి ఇచ్చే ముందు ఎఐసిటిఇ తనిఖీ చేసి అనుమతి ఇస్తుంది. ఒకసారి అనుమతి ఇచ్చిన తరువాత వాటిపై ఏమైనా ఫిర్యాదులు వస్తే తిరిగి తనిఖీ చేస్తాం. ఫిర్యాదులు నిజమని తెలితే వాటి గుర్తింపు రద్దు చేస్తాం. సీట్లు, కోర్సులు తగ్గిస్తాం. ఎనిమిది వేల కాలేజీలను ప్రతి సంవత్సరం తనిఖీ చేయడం సాధ్యమేనా అనేది అంద రూ అలోచించాలి. ఏటా కాలేజీలన్నంటినీ తనిఖీ చేయ డం సాధ్యం కాదు. ఆ స్థాయిలో సిబ్బంది కూడా లేరు. ప్రతిసారి తనిఖీలు చేయడం వల్ల యాజమాన్యాలను ఎఐసిటిఇ వేధిస్తుందనే అపవాదు వచ్చే అవకాశం ఉంది.
ప్రశ్న: నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
సహస్ర బుద్దే: ఇంజినీరింగ్, వృత్తి విద్యలో నాణ్య తా ప్రమాణాలు తగ్గుతున్న మాట వాస్తవం. దీనిపై ఇప్పటికే చర్చ మొదలైంది. ఇంజినీరింగ్ విద్యార్థులను కంపెనీలకు టైఆప్ చేయాలని దేశంలోని పారిశ్రామిక వేత్తలను, కాలేజీ యాజమాన్యాలను కోరాం. యజ మాన్యాలు, యూనివర్శిటీలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించాం.
ప్రశ్న: ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ ఎలా ఉంది?
సహస్ర బుద్దే: దేశ వ్యాప్తంగా ఇంజినీరింగ్, వృత్తి విద్య కాలేజీల్లో 50 శాతం సీట్లు భర్తీ కావడంలేదు. యాజమాన్యాలు కూడా 10, 20 సీట్లు భర్తీ అయిన కోర్సులను రద్దు చేసుకోవాలి. డిమాండ్ ఉన్న కోర్సులకే గుర్తింపు తీసుకోవాలి. ఇటీవల కొత్త కాలేజీల ట్రెండ్ తగ్గింది. యాజమాన్యాలు కాలేజీలను స్థాపించడానికి ముందుకు రావడంలేదు. అయితే నిబంధనల ప్రకారం అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్న వాటికి అనుమతి ఇవ్వ కుండా ఎలా ఉంటాం. అనుమతి ఇచ్చిన కాలేజీల సమా చారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నాం.
ప్రశ్న: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సిల బస్ లేదనే విమర్శలున్నాయి. కరిక్యులమ్‌లో మార్పు లు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది?
సహస్ర బుద్దే: ఇంజినీరింగ్ సిలబస్ దేశ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 75 శాతం సిలబస్‌ను ఎఐసిటిఇ నిర్ణయిస్తుంది. మిగిలిన 25 శాతం స్థానిక అవసరాలకనుగుణంగా రూపొం దించు కోవచ్చు. ఇంజినీరింగ్‌లో జీవశాస్త్రాన్ని ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. విద్యా సంస్థలన్నీ స్వయం ప్రతిపత్తి పొందే విధంగా కృషి చేయాలి. ప్రపంచంలో మూడు దేశాలు మినహా మిగిలిన దేశాల్లో కాలేజీలన్నీ అటానమస్ హోదాను కలిగి ఉన్నాయి. మన దేశంలోని కాలేజీలు ఆ దిశగా ఆ ప్రయత్నాలు చేయాలి. కోర్సులకు కరిక్యులమ్ ముఖ్యం. కోర్సుకు గుర్తింపు ఇస్తే కాలేజీకి గుర్తింపు ఇచ్చినట్లుగా భాస్తున్నారు, అది సరికాదు.