Search
Tuesday 20 November 2018
  • :
  • :

నిబంధనలను పాతరేస్తున్న మెడికల్ షాపులు

The regulations are in the medical shops

జీవం కోల్పోతున్న జీవన ధారలు
మెడికల్ షాపుల్లో నిబంధనలు డొల్ల
ఫార్మాసిస్టుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులచే విక్రయాలు
డాక్టర్ చీటి లేకుండానే విక్రయాలు
శాంపిల్స్‌ను అంటగడుతున్న వైనం
పాలమూరులో మెడికల్ సిండికేట్
నెలకు వేలల్లో వసూళ్లు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ : ఉమ్మడి  మహబూబ్‌నగర్ జిల్లాలో మెడికల్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు నడుస్తున్నాయి. ఈ విషయాల న్నీ సంబంధిత అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  డాక్ట ర్ చీటి రాసిచ్చిన మందులనే ఇవ్వాలని, అది కూడా సంబంధిత డాక్టర్ అందరికీ అర్థమయ్యేలా ఆ మందుల వివరాలను చీటిలో రాయాలని కోర్టులు సైతం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఎక్కడా కూడా నిబంధనలు అమలు కావడం లేదు. మెడికల్ షాపులతో కమీషన్లపై ఆధారపడిన కొందరు వైద్యులు ఎక్కవ ధరలతో ఉన్న కంపెనీల మందులను వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోగులు ఆ మందులను కొనగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెడికల్ షాపులలో అనేక కంపెనీలు మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వీటిపై జిఎస్‌టి లేక పోయినప్పటికీ వివిధ కంపెనీలు  అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మెడికల్ ఏజెన్సీల ద్వారా మెడికల్ షాపులకు విక్రయిస్తున్నారు. ఏ మందులోనైనా సగానికి సగం లాభం ఉండంతో విచ్చల విడిగా మెడికల్ షాపులు పుట్టుకొస్తులన్నాయి.వాస్తవానికి మెడికల్ షాపు నిర్వహించుకోవాలంటే ఫార్మసి పూర్తి చేసుకున్న వారు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ షాపులో యూనిఫాంతో సంబందిత ఫార్మాసిస్టే మందులను రోగులకు ఇవాల్సి ఉంటుంది. డాక్టర్ తన చేతి ద్వారా రాసిచ్చిన మందులనే ఇవ్వాలని అనేక నిబంధనలు ఉన్నాయి. కాని ఎక్కడ కూడా నిబంధనలు అమలు కావడం లేదు. అనేక మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు కాకుండా పదవ తరగతి చదవిన వారు సైతం మెడికల్ షాపులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అసలు అనుమతులు లేని మెడికల్ షాపు లు ఎన్నో ఉన్నాయి. వైద్యులు రాసిన మందుల చిట్టిలు లేకుండానే మందుల విక్రయాలు చేపడుతున్నారు. మెడికల్ షాపుల నిర్వహణపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అప్పడప్పుడు పరిశీలించి తేడాలు వస్తే కేసులు నమోదు చేయా ల్సి ఉంటుంది. గడువు తేది అయిపోయినా ఇంకా ఆ మందులను విక్రయించినా, శాంపిల్స్ విక్రయిస్తున్నా చర్యలు తీసుకోవడంలేదు. మందులు విక్రయాలపై ఎప్పటికప్పడు బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఎక్కడా ఎలాంటి నిబంధనలు అమలు కావడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 1400 మెడికల్ షాపు ఉండగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనే పుట్టగొడుగుల్లా అనుమతులు లేని మెడికల్ షాపులు ఎన్నో ఉన్నాయి. కాని వాటిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.ఏ మెడికల్ షాపుల్లో చూసినా ఎలాంటి ఫార్మసిస్టు లేకుండానే విక్రయాలు జరుగుతుంటాయి.

Comments

comments