Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఎస్సారెస్పీలోకి స్వల్ప ఇన్‌ఫ్లో

The reservoir comes in at least 1226 cusecs of water

మనతెలంగాణ/మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయినిగా పేరొందిన ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతాల నుండి స్వల్ప వరదనీరు రాకతో నీటిమట్టం పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రిజర్వాయర్‌లోకి స్వల్పంగా 1226 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుండి మంచి నీటి అవసరాలకు 179 క్యూసెక్కులు, లీకేజీ రూపంలో 179 క్యూసెక్కుల నీరు వదలడం జరుగుతుందన్నారు. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగుల 90 టిఎంసిలు ఉండగా మంగళవారం సాయంత్రానికి నీటిమట్టం 1059.70 అడుగులు 13.276 టిఎంసిలుగా ఉందని ప్రాజెక్టు ఏఈ మహేందర్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది ఇదే రోజున 1055.00 అడుగులు 9.287 టిఎంసిలుగా ఉంది.

Comments

comments