Home కరీంనగర్ ప్రాణాలు తీసిన పాల ట్యాంకర్

ప్రాణాలు తీసిన పాల ట్యాంకర్

accident4

కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
ఐదుగురు మహిళా కూలీలతో సహా డ్రైవర్ దుర్మరణం
పది మందికి తీవ్ర గాయాలు
ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఆటోల మీద చర్యలు చేపడతాం
కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి

కరీంనగర్‌క్రైం: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామ ఎక్స్‌రోడ్ వద్ద శుక్ర వారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదు గురు మహిళా కూలీలతో సహ డ్రైవర్ మృతి చెందాడు. కరీంనగర్ రూరల్  సిఐ శశిధర్‌రెడ్డి కథనం మేరకు వివ రా లిలా ఉన్నాయి. కరీంనగర్ మండలంలోని చామనపల్లి గ్రామానికి చెందిన 15 మంది మహిళా కూలీలు కలిసి ఎపి 15 ఎక్స్ 4349 అనే నంబర్ గల ఆటోలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాలిపల్లి గ్రామానికి వెళ్తున్నారు. పత్తి పంటలో పత్తి వేరడం కోసం వీరంతా కూలీలుగా గాలి పెల్లి గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలో కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ వద్దకు చేరుకోగానే కొత్తపల్లి వైపు నుంచి చింతకుంట గ్రామం వైపు వస్తున్న ఎపి 29 టిబి 4649 అనే నంబర్ గల పాల ట్యాంకర్ అతివేగం గా వచ్చి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్ వొన్నం వెంకటమాధవరావు (52), పాటు అందులో ప్రయాణిస్తున్న మ్యాకల సాయిలీల (18),మ్యాకల దేవమ్మ (50),నాంపెల్లి లావణ్య (28) లు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. గాయ పడిన క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ మేకల లలిత (45), ఓదమ్మ (60)లు మృతి చెం దారు. ఆటోలో ప్రయాణిస్తున్న నేరెళ్ల శిరీష, ఒజ్జ లక్ష్మి నర్సవ్వ, గోవోళ్ల లత, విలాసాగరం గౌరవ్వ, మేకల విజ య, మేకల రేణుక, మేకల స్వప్న, మేకల శీరిషలు గాయ పడగా వారిలో కొందరికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మిగితా వారు ప్రైవేట్ ఆసుపత్రులలో చికి త్స పొందుతున్నారు. ఈ విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి ప్రమాద వివరా లను అడిగి తెలుసుకుని ఆసుపత్రికి చేరుకుని విలేకరులతో మాట్లాడారు. ఇక ముందు ఆటోలలో ఓవర్ లోడ్ వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా ఓవర్‌లోడ్ ఆటోలలో ప్రయాణించకూడదనే విషయాన్ని ప్రజలు కూడా గమనించాలని అన్నారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఆటోల మీద చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను వెంటనే ప్రారంభిస్తామని తెలియజేస్తూ సిబ్బందికి అదే శాలు జారీ చేశారు. ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోధనలతో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారం భించినట్లు కరీంనగర్ రూరల్ సిఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదం సమాచారం అందుకు న్న వెంటనే స్థానిక ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్  కరీం నగర్‌కు చేరుకుని మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యు లను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 3.50 లక్షల ఎక్స్‌గ్రేషియా తోపాటు ఇటు క్షతగాత్రులకు అటు మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను అందజేస్తామని ప్రకటించారు. ఆయనతో పాటు కరీంనగ ర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, బి జెపి రాష్ట్ర నాయకుడు బండి సంజయ్‌కుమార్ తదితరులు ఆసుపత్రికి వద్దకు చేరుకుని మృతుల కుటుంబాలకు తమ సానుభూతి తెలిపి, వారి బంధువులను పరామర్శించారు.