Home మెదక్ ప్రగతి భవన్‌కు తరలి వెళ్లిన గులాబీ శ్రేణులు

ప్రగతి భవన్‌కు తరలి వెళ్లిన గులాబీ శ్రేణులు

trs2

మన తెలంగాణ/పటాన్‌చెరు : దేశ రాజకీయాల్లో మార్పు అవసరమన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన నిర్ణయానికి మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్యే గూడం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగిన సభకు పటాన్‌చెరు నియోజక వర్గం నుంచి పెద్ద ఎత్తున టిఆర్‌ఎస్ శ్రేణులు బయల్దేరి వెల్లారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ అవసారాలు, పరిస్థితులు మారాయని వాటికి అనుగునంగా ప్రస్తుత పరిస్థితుల్లో థర్డ్ ప్రంట్ అవసరం అని చెప్పడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దీర్గ కాలంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏమి ఒరుగపెట్టిందని, అదే తరహాలో ఎన్‌డీఏ (బీజేపీ) పార్టీ దేశాన్ని పాలించడంలో ప్రూర్తిగా విపుల మవుతుందని విమర్శించారు. అందు కోసమే దేశాన్ని పాలించడానికి ప్రత్యామ్నాయంగా ఓ ప్రంట్ అవరమరమని గ్రహించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లో భలమైన నాయకుడుగా, ఉద్యమ నేతగా పేరున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా ఏర్పడబోయె ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తాననడం అర్హించదన్న పరిణామమన్నారు. ప్రగతి భవన్‌కు బయల్దేరిన వారు పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం ల ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, కొలన్ రవిందర్‌రెడ్డి నాయకులు దశరత్ రెడ్డి, పాండు రంగారెడ్డి, హన్మంతరెడ్డి, కుమార్ గౌడ్, మల్లారెడ్డి, విజయ్, గడీల కుమార్ గౌడ్, గూడెం మదుసూదన్ రెడ్డి, మెట్టు కుమార్ తదితరులు ఉన్నారు.
నంగునూరులో : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ డిల్లీ రాజకీయల్లోకి రంగప్రవేశం చెయ్యాలని మద్దతు పలికేందుకు నంగునూరు మండల టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపిటీసీలు ఆదివారం రోజున హైద్రాబాద్ ప్రగతి భవన్‌కు ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి ఆద్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. ఎంపిపి వెంట పిఏసీఎస్ ఛైర్మన్లు కోల రమేశ్ గౌడ్, ఎడ్ల సోమిరెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అద్యక్షులు లింగం గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఆజీజ్, నాయకులు ఆకుబత్తిని రాము, లకా్ష్మరెడ్డి, కోల సతీష్ గౌడ్, మహేందర్ గౌడ్ తో పాటు పలువురు నాయకులు, సర్పంచులు, ఎంపిటీసీలు తరలివెళ్లారు.
దుబ్బాకలో : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రాన్ని అభివృద్ది పరుస్తున్నాడని టిఆర్‌ఎస్ నాయకులు పేర్కోన్నారు. ఆదివారం రోజున దుబ్బాక, మిరుదొడ్డి మండలాల నుండి తెలంగాణ ప్రగతి భవన్‌కు పలు వాహానాల్లో తరళివెళ్ళారు. అంతకు ముందుకు వారు మాట్లాడుతూ… కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరారు. అప్పుడే నిజమైన స్వాతంత్ర భారత దేశం అవుతుందని వారు పేర్కోన్నారు.
చేగుంట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుకుగా పాల్గోనాలని కోరుతూ దుబ్బాక నియోజకవర్గం లోని నార్సింగి – చేగుంట మండలాలకు చెందిన తెరాస ముఖ్య నాయకులు హైద్రాబాద్ ప్రగతి భవన్ తరలి వెళ్ళారు. చేగుంట మండల తతెలంగాణ రాష్ట్ర సమితతి పార్టి అద్యక్షులు తాడె వెంగళ్రావు ఆద్వర్యంలో సుమారు 50 మంది చేగుంట, నార్సింగి మండలాల నుండి తరలి వెళ్ళారు. ఈ సందర్బంగా వెంగళ్రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి , తెలంగాణ రాష్ట్ర సమితీ అద్యక్షులు కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలలో పాల్గోనాలని కోరడానికి వెలుతున్నట్లు తెలిపారు. తరలి వెళ్ళిన వారిలో యంపీపీ అల్లిరమ, నాయకులు శ్రీను, మోహన్‌రెడ్డి, అంజిరెడ్డి, రాంచంద్రం, సిద్దిరాములు, రాములు,అంజాగౌడ్,రెడ్యానాయక్,నాగభూశనం, జగన్‌గౌడ్, అంజిరెడ్డి, తదితరులు ఉన్నారు.
నార్సింగి మండలం నుండి…
నార్సింగి మండలం నుండి టెలికం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్ ఆద్వర్యంలో హైద్రాబాద్ తరలి వెళ్ళారు. రాజేశ్‌తో పాటు సోసైటీ చైర్మన్ తౌర్యానాయక్, బిక్యా నాయక్,యంపీటీసి సత్యం, శ్రీపతిరావు, నర్సింలు, రబ్బాణి,భూపతి, ఎన్నం లింగారెడ్డి తదితరులు తెళ్ళారు.