Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

ఈ వారం రూపాయి 70కి పతనం

 one-rupee-coin

డాలర్  పటిష్టం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో ప్రభావం: బ్యాంకర్లు

 ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి ఈవారం 70ను తాకవచ్చని బ్యాంకర్లు పేర్కొంటున్నారు. అమెరికా డాలర్ వరుసగా బలోపేతం అవుతుండడం, భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం, ముడి చమురు ధరలు పెరగవచ్చనే ఆందోళనలతో రూపాయిపై ఒత్తిడి నెలకొంది. దేశీయ కరెన్సీకి 69.30 స్థాయి కీలకమని, దీనిని దాటితే రూపాయి విలువ 70 మార్క్‌కు పడిపోవచ్చని బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే జూన్ 28వ తేదీన డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి అత్యల్పస్థాయి రూ. 69.10కి పతనమవగా.. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఈ వారం రూ.70 మార్కును తాకవచ్చని భయాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దీనిని నిరోధించే దిశగా చర్యలు చేపట్టాల్సి వస్తుందని బ్యాంకర్లు అంటున్నారు. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఆయిల్ కంపెనీల నుంచి డాలర్‌కు డిమాండ్‌తో రూపాయి క్షీణత కారణంగా కరెం ట్ ఖాతా లోటు పెరగవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 29జూన్ నాటికి భారత విదేశీ మారకద్రవ్య రిజర్వులు 406.058 బిలియన్ డాలర్లు ఉన్నాయి. అమెరికాకు చెందిన మెర్రిల్ లించ్ నివేదిక ప్రకారం ఆర్‌బిఐ వడ్డీరేట్ల పెంపు కూడా రూపాయిని బలహీనపరిచింది. జూన్ 6 నుంచి రూపాయ విలువ 1.9 శాతం క్షీణించింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ప్రభావం ఆసియా దేశాల కరెన్సీలను ఒత్తిడికి గురిచేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు భారత్‌లో ఎఫ్‌పిఐ(విదేశీ ఇన్వెస్టర్లు) తగ్గుము ఖం పడుతున్నాయి. విదేశీ అప్పులు తీసుకొచ్చిన కం పెనీలకు చెల్లింపులు భారంగా మారే అవకాశముంది. దేశం 80 శాతం క్రూడ్ ఆయిల్ దిగుమతులపైనే ఆధారపడం వంటివి రూపాయిని దెబ్బతీస్తున్నాయి.

Comments

comments