Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ఐదు నెలల గరిష్ఠానికి రూపాయి విలువ

coin

న్యూఢిల్లీ: రూపాయి విలు వ కొత్త సంవత్సరం తొలి రోజు పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపా యి మారకం విలువ 63.65తో ఐదు నెలల గరిష్ఠానికి చేరుకుంది. 2017 ఆగస్టు నుంచి డాలర్‌పై రూపాయి విలువ ఇంతగా పెరగడం ఇదే.. శుక్రవారం రోజు డాలర్‌పై రూపాయి 21 పైసలు పెరిగి 63.87 వద్ద ముగిసింది. ఇప్పుడు మరింతగా పుంజుకుని 41 పైసలు ఎగిసి 63.63  స్థాయిని చేరుకుంది. అంతేకాదు 2018 సంవత్సరంలో రూపాయి విలువ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికన్ కరెన్సీ డాలర్‌లో బ్యాంకర్లు, ఎగుమతిదారులు  భారీ అమ్మకాలు  తదితర కారణాలు  దేశీయ కరెన్సీకి సానుకూలంగా మారాయని నిపుణుల అంచనా వేస్తున్నారు. అటు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూపాయికి మద్దతు లభించింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు భారీ నష్టాల్లో ముగిసినప్పటికీ మార్కెట్లు స్థిరంగా  ఉండడం రూపాయికి లాభించింది.  2017లో రూపాయి  6 శాతం పెరిగిన విషయం తెలిసిందే. అలాగే డాలర్ కూడా ఇతర గ్లోబల్ కరెన్సీలతో పోలిస్తే లాభాలను అందిస్తోంది. మరోవైపు  2018 మొదటి త్రైమాసికంలో రూపాయి 63 స్థాయికి చేరుతుందని ఫారెక్స్ సలహా సంస్థ ఐఎఫ్‌ఎ గ్లోబల్ పేర్కొంది.  2018 సంవత్సరం రూపాయికి సానుకూలంగా ఉండనుందని ఫారెక్స్  ఎడ్వైజరీ సంస్థ పేర్కొంది.

Comments

comments