Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

68 మార్క్ దిగువకు రూపాయి

bs

న్యూఢిల్లీ: కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇటు స్టాక్ మార్కెట్లు, అటు రూపాయి రెండింటిపైనా తీవ్ర ప్రభావం ఏర్పడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 68 మార్క్ దిగువకు పడిపోయింది. ఇంతలా రూపాయి పతనం కావడం 2017 జనవరి నుంచి ఇదే తొలిసారి. కర్నాటక రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో స్టాక్ మార్కెట్లు పతనం కాగా.. ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. రూపాయి విలువ గత ముగింపు కంటే 59 పైసలు పడిపోయి 68.11 వద్దకు చేరింది. మరోవైపు డాలర్‌కు డిమాండ్ కూడా భారీగా పెరగడం వల్ల మరింతగా బలపడుతూ వస్తోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ వద్ద పౌండ్ స్టెర్లింగ్ కూడా రూ. 91.28/ 92.00 వద్ద ముగిసింది. కర్నాటకలో ప్రధాని మోడీ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, జనతా దళ్(సెక్యులర్)తో జట్టుకడతామని ప్రకటించడంతో మార్కెట్ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. గత కొన్ని రోజులుగా ముడి చమురు ధరల పెర గడం కూడా దేశీయ కరెన్సీని దెబ్బతీస్తున్నాయి. అమెరికా ఫెడ్ రిజ ర్వు నిర్ణయాలు వంటివి కూడా రూపాయి పతనానికి కారణమవుతున్నాయి.

Comments

comments