Home బిజినెస్ రికార్డు స్థాయిలో రూపాయి విలువ పతనం ఎందుకు?

రికార్డు స్థాయిలో రూపాయి విలువ పతనం ఎందుకు?

The rupee's value drops daily

డాలరు మారకంతో రూపాయి శుక్రవారం రూ. 69.13కి పతనం
రూపాయి విలువ పడిపోడానికి అనేక కారణాలు

న్యూఢిల్లీ: మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో రూపాయి విలువ డాలరు మారకానికి శుక్రవారం రూ. 69.13కు పడిపోయింది. రూపాయి పతనానికి అనేక కారణాలున్నాయి.

అవేంటో చూద్దాం:
బిగిసిన ఆర్థిక విధానం అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు ఆర్థిక విధానాన్ని బిగించడంతో డాలరు విలువ బలపడింది. ద్రవ్యోలణంతో అమెరికా ఆర్థిక విధానం మెరుగుపడింది.అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు త్వర లో తటస్థ రేటు(న్యూట్రల్ రేట్) చేపట్టనున్నట్లు సమాచారం. ఆర్థిక మార్కెట్లలో పెరిగిపోతున్న రేటును నివారించడానికే ఈ చర్యను చేపట్టబోతున్నది. అమెరికాలో స్వల్పకాలిక రేట్లు పెరగడంతో విదేశీపోర్ట్‌ఫోలియో మదుపరులు దేశీయ బాండ్ మార్కెట్లను వదిలేసి వరుసగా ఆరునెలలు డాలరు నికర అమ్మకందారులుగా మారారు.

కృత్రిమంగా పెరిగిన ముడి చమురు ధరలు
భారత కరెంట్ ఖాతా సమతుల్యాన్ని కరెంటు ఖాతా లోటు బాగా దెబ్బ తీసింది. కరెంట్ ఖాతా లోటు అంటే విదేశీ మారకం ఆర్జన, వ్యయం మధ్య ఉండే తేడా. ప్రపం చ ముడి చమురు ధరలు బ్యారలుకు 10డాలర్లు పెరిగినా ద్రవ్యోల్బణం 40 నుంచి 50 బేసిస్ పాయింట్లు పెరుగు తుంది. 100 బేసిస్ పాయింట్లను 1శాతం వడ్డీగా పర గణించాలి.అంటే భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధికి 0.1శాతం కోత పడుతుంది.వస్తు,సేవల పన్ను(జిఎస్‌టి) ప్రేరేపిత అంతరాయాల కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి కి అనుగుణంగా ఎగుమతులు ఊపందుకో లేదు.

వాణిజ్య యుద్ధాలు
అమెరికా, చైనా మధ్య చోటుచేసుకున్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్ ప్రభావితమైంది. ఇక చైనా కరెన్సీ యువాన్ బలహీనపడ్డం వల్ల ఆసియాలోని ఇతర కరెన్సీలు కూడా బలహీనపడ్డాయి. ఇదే వరుసలో డాలరు మారకానికి రూపాయి విలువ కూడా పతనమైంది. అమెరికా విధించిన సుంకాల ప్రభావంను ఎదుర్కొనేందుకు చైనా సైతం తన కరెన్సీ యువాన్ విలువ పతనం అయ్యేందుకు అనుమతించింది.

ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపు
దేశీయంగా ప్రధాన ద్రవ్యోల్బణం(కోర్ ఇన్‌ఫ్లేషన్) కొనసాగుతున్నందున భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) ఈ ఏడాది చివరికల్లా వడ్డీరేట్లపై తన తటస్థ వైఖరిని మార్చుకునే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు పెరిగితే కార్పొరేట్లకు రుణభారం పెరుగుతుంది. పైగా కార్పొరేట్ల మూలధనవ్యయాన్ని అది నిరుత్సాహపరుస్తుంది. ప్రైవేట్ విని యోగం కూడా బాగా తగ్గుతున్న సూచనలు కనబడుతున్నాయి.కనుక ఆర్థిక వృద్ధి గాడీలో కొనసాగాలంటే ప్రభు త్వ వ్యయం తప్పనిసరి. అప్పుడు ప్రభుత్వ వ్యయం బడ్జెట్‌కన్నా ఎకువ కాగలదు. దీనికి తోడు 2019లో లోక్‌సభ ఎన్నికలు, కొన్ని కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎనికలు కూడా జరగాల్సి ఉన్నాయి. ప్రభుత్వ వ్యయం పెరగ డం, జిఎస్‌టి మాసిక సేకరణ సన్నగిల్లడం, ఆర్థిక వృద్ధి తిరోగమించడం వంటివి మదుపరులకుఅనుకూలంగా ఉండ వు. ముఖ్యంగా విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులకు.

రాజకీయ అనిశ్చితి
డాలరు మారకంతో రూపాయి విలువ పతనానికి మరో కారణం రాజకీయ అనిశ్చితి. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి కనుక ఫలితాలు ఎలా ఉండనున్నాయో, ఏ ప్రభుత్వం వస్తుందో అన్న అనిశ్చితి చాలా మందికి ఉంది. దీంతో భారత్‌లోకి తాజా మూలధన ప్రవాహం రావడం లేదు.పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కారణంగాదిగుమతిదారులు చెల్లించేందుకు డాలర్లను కొనడంపై కట్టుబాట్లు విధించారు. దానికారణంగా కూడా రూపాయి విలువ బలహీనపడింది.