Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

సౌదీ ఆర్మీచీఫ్‌పై వేటు

saudi-Arabia

దుబాయ్ : సౌదీ అరేబియాలో కీలక సైనిక ప్రక్షాళన జరిగింది. యెమెన్‌లో యుద్ధ సంక్షోభం నేపథ్యంలో సౌదీ సైనిక దళాల ప్రధానాధికారితో పటు ఇతర రక్షణ అధికారులను తొలిగించారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించారు. పూర్తి స్థాయిలో రక్షణ మంత్రిత్వశాఖ ప్రక్షాళన ఉంటుందని, ఇందు లో భాగంగానే ఆర్మీచీఫ్, ఇతర అధికారుల మార్పు జరగిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక దేశంలో మహిళకు కీలక విధుల అప్పగింత విస్తృతానికి చర్యలు కూడా చేపట్టారు. ఈ ప్రక్రియలో భాగంగా కార్మిక, సామాజిక వ్యవహారాల ఉప మంత్రిగా మహిళను నియమిస్తూ సౌదీ రాజు సల్మాన్ ఆదేశాలు వెలువరించారు. దేశ రక్షణ మంత్రిత్వశాఖ పరిపుష్టికి రూపొందించిన పలు విధాన పత్రాలకు కింగ్ సల్మాన్ ఆమో దం తెలిపారని ప్రకటన వెలువడింది. కార్యనిర్వాహక సరళిలో భారీ స్థాయిలో మార్పులు ఉంటాయి. సైనిక వ్యవస్థాగత పునర్నిర్మాణ ప్రక్రియకు ప్రాధాన్యత ఇస్తారు. అదే విధంగా పరిపాలనా, మానవ వనరుల అవసరాల భర్తీ ప్రక్రియలో కూడా సమూల మార్పులు ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుత ఉన్నత స్థాయి రక్షణ వ్యవస్థ మార్పులలో భాగంగా ఆర్మీ చీఫ్ అబ్దుల్హ్మ్రన్ బిన్ సలేహ్ అల్ బున్యాన్‌ను పదవి నుంచి తొలిగించారు.బున్యాన్ స్థానంలో ఇప్పుడు ఫయా ్యద్ బిన్ హమీద్ అల్ ర్వాఐలీ నియమితులు అయ్యారు. అతి పేద అరబ్ దేశం అయిన యెమెన్‌లో యుఎఇ ఆధ్వర్యంలోని సౌదీ సంకీర్ణ సేనలు ప్రతిష్టంభన నివారణలో వైఫల్యం చెందడంతో సౌదీ రాజు దీనికి చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు.

Comments

comments