Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

నేడు కలెక్టరేట్ ముట్టడి…

 The second step requires the distribution of sheep

మన తెలంగాణ/ జనగామ : జిల్లాలోని గొర్రెలకాపర్లకు, గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి రెండో దశ గొర్రెల పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న కలెక్టరేట్ ముట్టడిని తలపెట్టినట్లు గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర నాయకులు జాయ మల్లేశ్ తెలిపారు. సోమవారం స్థానిక జీఎంపీఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జీవో 559, 1016లను అమలుచేయాలని, ప్రతి సొసైటీ సభ్యుడికి గుర్తింపుకార్డు ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా నాయకులు వజ్జ పరశురాములు, పిక్క బీరప్ప, బీదని నరేష్, ఎస్.రాజు, రాజమైన శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Comments

comments