Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

తిమింగలాల భాష తెలుసా!

The Secret Language of Whales Revealed

సముద్రంలో మసలాడే తిమింగలాలు చాలా తెలివైనవి. అవి శబ్దాలు చేయడమే కాదు గ్రహిస్తాయి కూడా. మనకు అందనంత దూరంలో వేరే శబ్ద ప్రపంచంలో బతుకుతుంటాయి. అవి 20 కెహెచ్‌జడ్ కన్నా తక్కువ, 150 కెహెచ్‌జడ్‌ కన్నా ఎక్కువస్థాయి శబ్ద తరంగాలను గ్రహించగలవు. పరిసరాల్లో ప్రమాదం ఉంటే వెంటనే గుర్తిస్తాయి. వెంటనే తోటి తిమింగలాలకు సంకేతాలు అందిస్తాయి. గాఢ చీకటిలో నైనా ఆహారం ఉనికిని గుర్తిస్తాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ శబ్దాలను వినగలిగే చిట్కా కనుగొన్నారు. తిమింగలాలతో మాట్లాడడానికి వీలుగా సంకేతాలు అందించగలిగే ఉపాయాన్ని తెలుసుకున్నారు. తిమింగలాల వినికిడి నైపుణ్యాన్ని కొలవగలుగుతున్నారు. స్పీకర్లు పెట్టి వాటి శబ్దాలను వినడానికి ఎంత ప్రయత్నం చేసినా ఒక కొలిక్కి రాకపోవడంతో ఆడియో ప్లేబాక్ ప్రయోగాలు కొన్ని వీటిపై చేశారు. టోక్యో యూనివర్శిటీ మెరైన్‌సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఏదో ఒకనాడు తిమింగలాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుని వాటికి సమాధానం ఇచ్చే అవకాశం లభిస్తుందన్న ఆశాభావం వెలిబుచ్చారు.

Comments

comments