Home ఆదిలాబాద్ మురిపించి.. మైమరిపించి.. జాలి చూపని మేఘం

మురిపించి.. మైమరిపించి.. జాలి చూపని మేఘం

The seed sprouting with sunny

జావ కారుతున్న సేద్యం
ఎండలతో మొలకెత్తని విత్తనం
మొక్కలను బతికించేందుకు రైతుల నానాపాట్లు

మన తెలంగాణ/ఆదిలాబాద్ బ్యూరో: మది నిండా ఆశతో ఏరువాక సాగించిన రైతాంగం ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా తల్లడిల్లుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే నైరుతి రుతుపవనాల ప్రభావం జిల్లాపై విస్తారంగా ప్రభావం చూపింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మృగశిరకార్తె ప్రారంభంతో భారీగా వర్షాలు నమోదయ్యాయి. సాధారణం కంటే ఎక్కువ శాతం వర్షాలు కురిశాయి. దీంతో ఉబ్బితబ్బిబ్బైన రైతాంగం విత్తనాలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున ఉపక్రమించారు. ఉమ్మడి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు
మన తెలంగాణ/ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో ముస్లీం సోదరులు ఘనంగా ఈద్ ఉల్ పితర్ వేడుకలను జరుపుకోగా, పలువురు రాజకీయ పార్టీల నాయకులు ఈద్గా మైదానానికి చేరుకొని ముస్లీం సోదరులకు ఈద్ ముబాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎఐసిసి సభ్యులు మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముస్లీం సోదరులందరికి తమ పార్టీ తరపున ఈద్‌ఉల్‌పితర్ శుభాకాంక్షలు తెలియచేశారు. నిరుపేద ముస్లింలు సహితం సంతోషంగా పండగ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. అటు ఎఐసిసి సభ్యురాలు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సు జాత మాట్లాడుతూ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలకు కలిసి మెలిసి సోదరబావంతో జరుపుకోవాలన్నారు. ముస్లీం సోదరులందరికి ఈ సందర్బంగా పవిత్ర రం జాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ భార్గవ్ దేశ్ పాండే మాట్లాడుతూ అల్లా దయవలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. ముస్లిం సోదరులందరు కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. టిడిపి జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాలకు, కులాలకు సమాన ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ప్రజలందారు ఇదే విధంగా మత సామరస్యాన్ని పాటిస్తూ పండగలను జరుపుకోవాలని కోరారు. ముస్లీం సోదరులందరికి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుక్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. తెలంగాణతో పాటు ఆదిలాబాద్‌లో శాంతి భద్రతలు ఇదే వి ధంగా వుండాలని, ప్రజలందరి పై అల్లా కరుణా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు. వేడుకలను ఘనంగా నిర్వహించటానికి సహకరించిన అధికారులకు, నాయకులు కృతజ్ఞతలు తెలియచేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో 16 లక్షల ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణం ఉండగా, ఈ ఏడాది పది శాతం అదనంగా సాగు నమోదవుతుందని అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచారు. అయితే సాధారణంలో సగానికి పైగా పత్తి పంటను రైతులు సాగు చేశారు. చాలా చోట్ల విత్తనాలు మొలకెత్తాయి. సాధారణ వర్షపాతం ఆదిలాబాద్‌లో 50 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 127 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా నిర్మల్‌లో 60 మిల్లీమీటర్లకు గాను 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని 37 మండలాల్లో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కాగా, చాలా చోట్ల తక్కువగా నమోదైంది. తొలకరి ప్రారంభంలోనే వర్షాలు భారీగా కురవడంతో 70 శాతానికి పైగా రైతులు విత్తనాలను నాటారు. తొలకరి ప్రారంభమై వారం రోజులు గడిచినా వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండడం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. అయితే నల్ల రేగడి భూములకు మాత్రం మరో రెండు, మూడు రోజుల వరకు మొక్కలు తట్టుకొనే పరిస్థితి ఉందని, చెలక భూములు, ఎర్రరేగడి భూముల్లోని మొక్కలు మాత్రం ఈ పాటికే నీటి తడి అందాల్సి ఉండగా, అందక పోవడంతో అవి ఎండిపోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండోసారి విత్తనాలు నాటాల్సిన పరిస్థితి దాపురిస్తుందని దీంతో సమయం వృధా కావడంతో పాటు రైతులపై ఆర్థికభారం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గడిచిన మూడు రోజులుగా వాతావరణంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. మండు వేసవి కారణంగా జిల్లాలోని చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రదానంగా 24 గంటల విద్యుత్ సరఫరా కారణంగా రబీలో ఎక్కువగా సాగు విస్తీర్ణం నమోదు కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగేందుకు గుక్కెడు నీరు సైతం కొన్ని చోట్ల కరువయ్యాయి. అయితే అధికారులు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసినప్పటికీ నీటి గోస చవి చూడక తప్పలేదు. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా భారీ వర్షాలు కురవడంతో భూగర్భ జల మట్టం ఒకేసారి రెండు మీటర్ల వరకు పెరిగింది. తాగునీటికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ ప్రస్తుతం వ్యవసాయానికి మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యుత్ మోటార్లు ఉన్న రైతులు మాత్రం తమ పంటలను కాపాడుకొనేందుకు స్పింక్లర్ల ద్వారా నీటి తడిని అందిస్తున్నారు. వర్షాధారంపై ఆధారపడిన భూముల రైతులు మాత్రం ప్రస్తుతం ఆకాశం వైపు ఎదరుచూస్తూ నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. వరుణుడు కరుణిస్తేనే తమ పంటలు సమృద్దిగా పండుతాయని లేదంటే అప్పలు ఊబిలోకి మరోసారి కూరుకుపోయే ప్రమాదం ఉంందని అంటున్నారు.