Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నిఫ్టీ@10,600

34,350 పైన ముగిసిన సెన్సెక్స్

Niftyన్యూఢిల్లీ : వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఆశలు, కార్పొరేట్ ఫలితాలపై సానుకూల దృక్పథంతో బెంచ్‌మార్క్ సూచీలు రికార్డు స్థాయి గరిష్ఠంలో ముగిశాయి. జిడిపి వృద్ధి రేటు అంచనాలు ఆశించిన మేరకు లేకున్నా ఇతర అంశాలు మార్కెట్‌కు ఉత్సాహాన్ని ఇచ్చాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది. దీంతో దేశీయ సూచీలు సోమవారం సరికొత్త రికార్డు సృష్టించాయి. సెన్సెక్స్ 198.94 పాయింట్ల లాభంతో 34352.79 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 64.75 పాయింట్ల లాభంతో 10623 వద్ద ముగిసింది. టెలికాం రంగాలకు చెందిన సూచీ తప్ప మిగతా రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఇలో నిఫ్టీ సూచీ 10,631 నుంచి -10,589 పాయింట్ల రేంజ్‌లో ట్రేడ్ అయ్యింది. కీలకమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బ్యాంక్ సూచీ 74 పాయింట్లు లాభపడి 25,676 పాయింట్లకు చేరింది. కోల్ ఇండియా, లుపిన్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, ఇండియన్ బుల్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 3 నుంచి 2 శాతం లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, ఒఎన్‌జిసి, హెచ్‌సిఎల్ టెక్, టాటాస్టీల్, ఏసియన్ పేయింట్స్ షేర్లు 4 నుంచి 1శాతం నష్టపోయాయి.
నిఫ్టీ మరో రికార్డు
నిఫ్టీ కీలక 10,600 పాయింట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. సానుకూల అంతర్జాతీయ పరిణామాలు, త్రైమాసికంలో కంపెనీలు మంచి ఫలితాలను సాధించవచ్చనే అంచనాలతో సూచీలు మొదలయ్యాయి. సెన్సెక్స్ 163 పాయింట్లు పెరిగి 34,317 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 10,605 పాయింట్ల ప్రారంభయ్యాయి. ఫార్మా, రియల్టీ, ఐటీ రంగాల షేర్లు భారీగా లాభపడం సూచీలకు మరింత జోష్‌ను ఇచ్చింది. దీంతో సెన్సెక్స్ 200 పాయింట్ల మేరకు పెరిగి కీలక మార్కును చేరుకుంది.
9 శాతం పెరిగిన ఐడిఎఫ్‌సి షేరు
మార్కెట్లో ఐడిఎఫ్‌సి బ్యాంక్ షేరు ఒక్కసారిగా 10 శాతం వరకు పెరిగింది. కొద్ది రోజులుగా బ్యాంకింగ్ రంగ షేర్లు ర్యాలీని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఐడిఎఫ్‌సి బ్యాంక్ షేరు ఇవాళ ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఓ దశలో 9 శాతానికి మించి లాభపడి రూ.64.50 వద్దకు చేరుకుంది. షేరు విలువ రూ.6 వరకు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ సూచీలో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఈ షేరు 52 వారాల గరిష్టస్థాయికి చేరుకుంది.

Comments

comments