Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కోలుకున్న స్టాక్‌మార్కెట్లు

 bs

భారీగా 470 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 

 10,100 కీలక మార్క్‌ను దాటిన నిఫ్టీ 

ముంబై: వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు భారీగా లా భపడ్డాయి. దిగుమతి సుంకం పెంపు నేపథ్యంలో వాణిజ్య యుద్ధం భయాలు నెలకొనగా.. ఈ అం శం పరిష్కారం కోసం చైనా, అమెరికా దేశాల మధ్య చర్చలు జరగనున్నాయనే వార్తలతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు తగ్గాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 470 పాయింట్లు పెరిగి 33,066 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 133 పాయింట్లు పుంజుకుని 10,131 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 33,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా, ఇటు నిఫ్టీ 10,000 పాయింట్ల మార్క్‌తోపాటు సాంకేతికంగా కీలకమైన 10,100 స్థాయిని కూడా చేరుకుంది. అమెరికా, చైనా ఒక అంగీకారానికి వచ్చే వీలున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ ముచిన్ తాజాగా ఆశాభావాన్ని వెలిబుచ్చడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే బ్యాంక్ నిఫ్టీ కోలుకుని 2.5 శాతం మేరకు లాభపడింది. ఇందుకు పిఎస్‌యు బ్యాంక్స్ 5 శాతం వృద్ధి దోహదం చేసింది. ఈ బాటలో మెటల్, ఆటో, ఎఫ్‌ఎంసిజి, రియల్టీ కూడా 1 శాతానికి పైగా పుంజుకోగా ఐటి 0.6 శాతం బలహీనపడింది. ప్రధానంగా యస్‌బ్యాంక్, ఎస్‌బిఐ, జి, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, వేదాంతా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యుపిఎల్, హిందాల్కో, ఎల్ అండ్ టి 6.4- నుంచి 2.3 శాతం మధ్య పెరిగాయి. అయితే గెయిల్, విప్రో 3.5 శాతం నష్టపోయాయి. హెచ్‌పిసిఎల్, ఇన్ఫోసిస్, బాష్, అరబిందో 1.5- నుంచి 0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. మార్కెట్ల బాటలో మిడ్ సెషన్ నుంచీ చిన్న షేర్లకూ డిమాండ్ పుట్టింది. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం పుంజుకోగా, స్మాల్ క్యాప్ 0.7 శాతం బలపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1192 లాభపడగా.. 1552 షేర్లు నష్టపోయాయి.  నగదు విభాగంలో శుక్రవారం(23న) విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1628 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. ఇక దేశీ ఫండ్స్(డిఐఐ) రూ. 935 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.

Comments

comments