Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మెరిసిన రిలయన్స్, ఐటి

bsns

 గతవారం ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్
 11వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

గతవారం స్టాక్‌మార్కెట్లు కొత్త రికార్డులను సృష్టించాయి. రిలయన్స్, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి వంటి హెవీవెయిట్స్ షేర్లతో సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరగా, నిఫ్టీ కీలక మైలు రాయి 11,000 మార్క్‌ను అధిగమిం చింది. టిసిఎస్ త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోవడంతో సాను కూల సంకేతాలతో రాబడి సీజన్ ప్రారంభమైంది. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి విలువ పుంజుకోవడం వంటివి మార్కెట్ సెంటి మెంట్‌ను బలపర్చగా.. మిడ్, స్మాల్ క్యాప్స్ మాత్రం పతనం దిశలోనే పయ నిస్తున్నాయి. వచ్చే వారం పెద్ద సంస్థల త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరలు, రూపాయి కదలికలు, పార్ల మెంటు సమావేశాలు వంటివి మార్కె ట్‌ను శాసించనున్నాయి. ఐటి, ఎఫ్‌ఎం సిజి, బ్యాంక్, ఫైనాన్షియల్, ఫార్మా రంగాల స్టాక్స్‌లో కొనుగోళ్లు కొనసా గుతాయని భావిస్తున్నారు.
-మార్కెట్ సమీక్ష

దేశీయ ఇండెక్స్, గ్లోబల్ మార్కెట్

మిడ్ క్యాప్‌లో కొన్ని కొనుగోళ్ళు కనిపించాయి. అయితే ఇది ముందు వరుస సూచీలతో పోలిస్తే పరిమితంగా ఉండిపోయింది. నిఫ్టీ ఐటి, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసిజి ఇండెక్స్ 2 నుంచి 4 శాతం లాభపడి.. మార్కెట్లో రాణించాయి. నిఫ్టీ మెటల్, రియాల్టీ, ఆటో, మీడియా, ఫార్మా రంగాలు డీలాపడ్డాయి.- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో 200 బిలియన్ డాలర్ల
మేరకు చైనీస్ దిగుమతులపై 10% సుంకం విధిస్తామని హెచ్చరించినప్పటికీ ఈ వారం గ్లోబల్ మార్కెట్లు లాభపడ్డాయి. అయితే గురువారం రెండు దేశాలు చర్చలు పునఃప్రారంభించాలని భావిస్తున్నాయి. ముడి చమురు బ్యారెల్ ధర 74 డాలర్లకు పడిపోయింది. కంపెనీలకు త్రైమాసిక ఫలితాలు వచ్చే వారాల్లో కీలకంగా మారనున్నాయి.
మార్కెట్‌కు కీలక అంశాలు
పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గణాంకాల విభాగం విడుదల చేసిన వివరాల ప్రకారం, పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపి) మే నెలలో 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5 శాతానికి పెరిగింది.

b

గత వారం మార్కెట్ ముఖ్యాంశాలు

* ఆసియా మార్కెట్ ర్యాలీతో బెంచ్‌మార్క్ సూచీలు ఐదు నెలల గరిష్ఠ స్థాయిలో ముగిశాయి.
* మెటల్, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఆటో, ఎఫ్‌ఎంసిజి, ఐటి కంపెనీలు 0.5- నుంచి 1.5 శాతం పెరిగాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.60 శాతం పెరిగింది.
* మంగళవారం మార్కెట్ బలపడింది. నిఫ్టీ 94.35 పాయింట్లు పెరిగి 10,947 వద్ద ముగిసింది.
* బుధవారం ఈక్విటీ సూచీలు అస్థిరంగానే ఉన్నాయి. సెన్సెక్స్ 26 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 10,950 పాయింట్ల దిగువన ముగిసింది.
* గురువారం మార్కెట్ జీవనకాల గరిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పెరగ్గా, నిఫ్టీ 11,000 పైన ముగిసింది.
* బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసిజి, రిలయన్స్ ర్యాలీ బాటలో పయనించాయి. అదే సమయంలో రియల్టీ, ఆటో, మీడియా, మెటల్ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ క్షీణించి 81 పాయింట్లు పతనమైంది.
* శుక్రవారం ఇన్ఫోసిస్, రిలయన్స్ నేతృత్వంలో మార్కెట్లు గరిష్ఠానికి చేరగా, నిఫ్టీ 11,000 లకు పైన స్థిరపడింది.

పరిశీలించాల్సిన విషయాలు
జూలై 16న టోకు ధరల సూచీ(డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం వెల్లడికానుంది. ప్రస్తుతం భారత ద్రవ్యోల్బణం రేటు 4.96 శాతంగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2018 జూలై 18 నుండి ప్రారంభమవుతాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఫెడరల్ బ్యాంకు, బజాజ్ ఆటో, విప్రో, ఆర్బిఎల్ బ్యాంక్ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి.

Comments

comments