Home మహబూబాబాద్ ఏజెన్సీ ఏరియాలో చదువుల తల్లి పై నిర్లక్ష్యం

ఏజెన్సీ ఏరియాలో చదువుల తల్లి పై నిర్లక్ష్యం

 The state government has a special focus on studies

మన తెలంగాణ/గూడూరు :  మండల ప్రజా పరిషత్ పాఠశాలలు 42, అందులో బియంహెచ్ 01, పియంయుపియస్ పాఠశాలలు 12, డియంపియుపి పాఠశాలలు 01, ట్రైబర్ హెల్పర్ పాఠశాలలు 36, జెపియస్ పాఠశాలలు 5, ఆశ్రమ పాఠశాలలు 05, రెసిడెన్షియల్ పాఠశాలలు 01, ఉన్నాయి. గూడూరు మండలం ఏజెన్సీ మండలం కావడంతో ఇక్కడి ఉపాధ్యాయులకు ఏజెన్సీ ఇన్‌గ్రిమెంట్ జీతం ఎక్కువగా వస్తుంది. ఏజెన్సీ మండలంలో ఉద్యోగం చేసే ఉద్యోగులు స్థానికంగానే ఉండాలనే నిబంధనలు ఉన్నా ఉద్యోగులు మాత్రం సెటిల్ సర్వీసు చేసు ఏజెన్సీ అలవెన్స్ మాత్రం వినియోగించుకుంటున్నారు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటే ఉపాధ్యాయులు ప్రభుత్వం ని బంధనలను పట్టించుకోకుండా నిర్వీర్యం చేస్తున్నారు. ఉన్న త అధికారులు స్థానికంగా లేకపోవడం వల్లే క్రింది స్థాయి ఉద్యోగులు అలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను అధిక సంఖ్యలో చేర్పించాలని ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ప్రచారాలు నిర్వహిస్తుంటే దానికి విరుద్దంగా ఉపాధ్యాయుల నియామకం కనిపిస్తుంది. మంగళవారం మండలంలోని అప్పరాజు పల్లి గ్రామ శివారు  ఆగబోయిన రాములు తండాలో ఇద్దరు ఉపాధ్యాయులకు ఇద్దరూ పా ఠశాలకు రాలేదు.

పాఠశాలలో పని చేసే ఆయా మాత్ర మే ఉంది. ఆ గ్రామంలోని తల్లి దండ్రులు పాఠశాలకు ఉపాధ్యాయులు రావడం లేదని వారిని వెంటనే మార్చి కొత్త ఉపాధ్యాయులను వేయాలని వారు అన్నారు. దామరవంచ గ్రామంలోని చతృతండా పాఠశాలలో గత 3 రోజుల నుండి ఉపాధ్యాయు లు రావడం లేదని, వచ్చినా పాఠశాల సమ యం తర్వాతే వచ్చి సమయం కాక ముందే వెళ్తున్నారని గ్రామస్థులు తెలిపారు. దామరవంచ ప్రాథమికొన్నత పాఠశాలలో ఆరుగురు ఉపాధ్యాయులకు నలుగురు మాత్రమే సమయానికి వచ్చారు. దామరవంచ గ్రామశివారు లక్ష్మీతండా గ్రామంలో ముగ్గురు ఉపాధ్యాయులకు ఒకరు మాత్రమే పాఠశాలలో ఉన్నారు. దీనికి అంతటికి కారణం మండలంలోని ఉన్నత అధికారుల నిర్లక్షం వల్లే ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మన తెలంగాణ విలేకరి ప్రశ్నించగా ఇది మాకు మామూలే అధికారులు మా చెప్పుచేతలలో ఉన్నారు. వారు మమ్మ ల్ని ఏమి చేయలేరు అని అన్నారు. ఇది ఇలా ఉంటే మండలంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పరిస్థితి కూడా ఇలానే ఉంది మండలంలోని దామరవంచ గ్రామపంచాయితీ పరిధిలో ప్రాథమిక పాఠశాలలో 2, లక్ష్మీతండా ప్రాథమిక పాఠశాలలో 2, చతృతండాలో 1 ఉండగా కేంద్రాలను తెరువక పోవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు స్పం దించి సమయపాలన పాటిం చని ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరు తున్నారు.