Home మెదక్ విద్యారంగాన్ని విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

విద్యారంగాన్ని విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

pd

* ప్రభుత్వ నిర్లక్షంతోనే ఉపాధ్యాయులకు సమస్యలు
* సిపిఎస్‌ను రద్దు చేసి వోపిఎస్‌ను పునరుద్దరించాలి
* టిపియుఎస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రేయకులకర్ణి
* టిపియుఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా

మన తెలంగామ/మెదక్ టౌన్ : సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్) జిల్లా అధ్యక్షుడు దత్తాత్రేయకులకర్ణి అన్నారు. మంగళవారం విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా సంయుక్త పాలనాధికారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల కృషిని ఆయన అభినందించారు. బంగారు తెలంగాణ సాధన కొరకు జరుగుతున్న ప్రయత్నంలో ముఖ్యమైన విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గా విస్మరిస్తుందన్నారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా  నిర్లక్షపరుస్తు ఉపాధ్యాయులను పూర్తిగా పట్టించుకోవడం లేదని దీనిని టిపియుఎస్ మెదక్ శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు టిపియుఎస్ ఆధ్వర్యంలో గత రెండు నెలల నుండి అనేక రకాల నిరసనలు తెలిపినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుండడంతో నేడు జిల్లాస్థాయి ధర్నాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించే విధంగా దృష్టి సారించి నెరవేర్చాలన్నారు. ముఖ్యంగా సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలి, పండిత్, పిఇటి పోస్టులను అప్‌గ్రేడేషన్ కల్పించాలి, ఏకీకృత సర్వీస్ రూల్స్‌ను వెంటనే అమలు పర్చాలని, వెసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు చేపట్టడమే కాకుండా అర్హతగల స్కూల్ అసిస్టెంట్స్ కు, జెఎల్‌ఎస్ మరియు డైట్ లెక్టరర్స్‌గా, ఎంఇవోలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. ఆరోగ్య కార్డు ద్వారా ఆసుపత్రులలో అన్ని జబ్బులకు డబ్బులు పరిమితి లేకుండా చికిత్సలు అందించాలని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య మాతృభాషలో బోధన, ఎస్‌జిటి, యంఎల్ సి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని, ఎంఇవో పోస్టుల స్థాయిని పెంచి మండలంలోని అన్ని పాఠశాలల పర్యావేక్షణ చేసే విధంగా బాధ్యతలు అప్పగించాలన్నారు. మహిళా ఉపాధ్యాయునీలకు 2 సంవత్సరాల చైల్డ్‌కేర్ లీవ్ ఇవ్వాలని, ఎల్‌టిసి సౌకర్యం పునరుద్దరించి ప్యాకేజ్ కార్డులు ఇవ్వాలన్నారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్ సరఫరతో పాటు విద్యార్థులు కనీస వసతులైన తాగునీటి సౌకర్యం, మూత్రశాలలు, మరుగుదొ డ్ల నిర్మాణంతో పాటు స్పీపర్‌ను నియమించాలని, మధ్యాహ్నభోజనంలో 150 గ్రా., 175 గ్రాముల బియ్యం సరఫరా చేయాలన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆదర్శ పాఠశాలల, ఏజెన్సీలలోని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, కెజిబివి ఉ పాధ్యాయులను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రూ. 398 వేతనంతో పనిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్ల్‌లు ఇవ్వాలనే తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.