Home సూర్యాపేట వడి వడిగా… అడుగులు…

వడి వడిగా… అడుగులు…

Jagaddish-reddy-image

నవ మనుగడకు ఆరోగ్యం ఎంతో ముఖ్య మైనది. పేదప్రజలకు భారంగా మారిన వైద్యాన్ని సకాలంలో అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసు పత్రుల ఏర్పాటు, డాక్టర్లు, సిబ్బంది నియామ కం చేపట్టడంతో పాటు ప్రజలకు మరింత మంది డాక్టర్లు అందుబా టులోకి రావడానికి వైద్య కళా శాలలు కూడా ఏర్పా టు చేస్తున్నారు. ఈ నేపథ్యం లో మెడికల్ కళాశాలల ఏర్పాటుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై సమీ క్షించడానికి గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సం క్షేమ శాఖా మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి ఛాంబర్‌లో రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సమావేశమ య్యా రు. తొలుత కళా శాలల ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరిం చడానికి ఆదేశాలు ఉన్న తాధికారులకు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరలో భూ సేకరణ పూర్తి చేయాలని మంత్రులు జగదీశ్‌రెడ్డి, లకా్ష్మ రెడ్డిలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

మన తెలంగాణ/సూర్యాపేట : బంగారు తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సత్వర చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మానవ మనుగడకు ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. పేద ప్రజలకు భారంగా మారిన వైద్యాన్ని సకాలంలో అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రుల ఏర్పాటు, డాక్టర్లు, సిబ్బంది నియామకం చేపట్టడంతో పాటు ప్రజలకు మరింత మంది డాక్టర్లు అందుబాటులోకి రావడానికి వైద్య కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సకాలంలో ఆరోగ్య సేవలు అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామన్న మాటలు ఆచరణకు నోచుకుంటున్నాయి. ఇటీవలే సూర్యాపేట, నల్లగొండలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం తెలిసిందే. దీంతో పాటు ఆయా మెడికల్ కళాశాలల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేస్తూ అందుకు అవసరమైన బడ్జెట్‌ను కూడా విడుదల చేయడం, ఆగమేఘాల మీద పనులు ఊపందుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో మెడికల్ కళాశాలల ఏర్పాటుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై సమీక్షించడానికి గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి చాంబర్‌లో రాష్ట్ర విద్యుత్, ఎస్‌సి కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమావేశమయ్యారు. తొలుత కళాశాలల ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించడానికి ఆదేశాలు ఉన్నతాధికారులకు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరలో భూ సేకరణ పూర్తి చేయాలని మంత్రులు జగదీశ్‌రెడ్డి, లకా్ష్మరెడ్డిలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి అన్ని రకాల అనుమతుల కోసం జూలై ఏడవ తేదీలోగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కావాల్సిన ఫార్మాల్టీస్ అన్ని పూర్తి చేయాలని ఈ సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. జూలై ఏడు లోగా అనుమతికి అవసరమైన అన్ని అంశాలను పూర్తి చేయాలని సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే కాళోజి నారాయణరావు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయంలో సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాల అనుమతుల కోసం పెట్టుకున్న ఆర్జీకి అనుమతులు లభించిన వెంటనే జూలై ఏడు లోపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అనుమతులు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని సమీక్షలో నిర్ణయించారు. అంతేగాకుండా భూ సేకరణ పనులను వేగవంతం చేయడంతో పాటు ఆరు నెలల వ్యవధిలోనే భవనాలను నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. నూతన భవన నిర్మాణాల నమూనాలను మంత్రులు పరిశీలించారు. ఇప్పటికే భూ సేకరణపై ఒక అభిప్రాయానికి వచ్చినందున తక్షణమే భూ సేకరణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు లకా్ష్మరెడ్డి, జగదీశ్‌రెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి, సూర్యాపేట కలెక్టర్ సురేంద్రమోహన్, వైద్య, విద్య సంచాలకుడు డాక్టర్ రమేష్‌రెడ్డి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ బి.శివప్రసాద్, టిఎస్‌ఎం ఎస్‌ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్‌రావు, సూర్యాపేట, నల్లగొండ మెడికల్ కళాశాలల నోడల్ అధికారులు దండా మురళీధర్‌రెడ్డి, నాగార్జునచారి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను కూడా తక్షణమే భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి లకా్ష్మరెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి దృష్టికి మంత్రి జగదీశ్‌రెడ్డి తీసుకొచ్చారు.
ముఖ్యంగా మత్తు వైద్యులు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించారు.