Home కుమ్రం భీం ఆసిఫాబాద్ రైతు బాగుంటేనే రాష్ర్టం బాగుంటుంది..

రైతు బాగుంటేనే రాష్ర్టం బాగుంటుంది..

Untitled-1

రైతు సంక్షేమానికి సిఎం కెసిఆర్ కృషి
పెట్టుబడి సాయానికి రూ. 12 కోట్లు
దేశంలో 24 గంటల విద్యుత్ ఇచ్చేది తెలంగాణనే
రైతుకు జూన్ నుంచి రూ. 5లక్షల బీమా
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ

మన తెలంగాణ/ఆసిఫాబాద్ :  రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందని భావించి ముఖ్యమంత్రి  కెసిఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.        అభివృద్ధిలో దేశంలో మనమే మొదటి స్థానంలో ఉన్నామన్నారు. మండలంలోని బాబాపూర్ గ్రామంలో పెట్టుబడి సాయం చెక్కులు, నూతన పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పోచారం శ్రీనివాస్, జోగురామన్న, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్త సుఖేందర్‌రెడ్డితో కలిసి  రైతులకు చెక్కులు, నూతన పాసుపుస్తకాల పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో ఆయన డిప్యూటీ సింఎ మహమూద్ అలీ  మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ. 16. 123 కోట్ల పంట రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందన్నారు. పెట్టుబడి      పథకంలో తొలివిడత 1.42 కోట్ల రైతులకు రూ. 5,700 కోట్లను రైతులకు అందజే స్తున్నామన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్టుబడి సాయం కింద రైతులకు రబీ, ఖరీఫ్ పంటలకు ఎకరానికి రూ. 8వేలు అందజేస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కుమ్రంభీం జిల్లా ప్రాంతానికి సాగునీరు, విద్యుత్ సక్రమంగా అందిస్తే  మంచి పంటలు సాగవుతాయనే ఉద్ధేశంతోనే జిల్లాలో అనేక ప్రాజెక్టులు, చెరువులకు మరమ్మతులు చేయిస్తున్నామన్నారు. కుమ్రం భీం జిల్లాలో 1.30 లక్షల మంది రైతులకు రూ. 147 కోట్ల పెట్టుబడి సాయం కింద అందజేస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న  మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో 75 శాతం మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, వీరిని అభివృద్ధి పర్చడానికే ముఖ్యమంత్రి ప్రపంచంలో  ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి  రెండు పంటలకు కలిపి రూ. 8 వేలు అందజేస్తున్నామన్నారు.  అనంతరం రైత సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్త సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్  2 నుంచి రైతు బీమా పథకం కింద రూ. 5లక్షల బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నారని, అలాగే ప్రతి క్లస్టర్‌లో రైతు సమన్వయ సమితి భవనాలను ఏర్పాటు చేసి అందులోనే రైతు సమావేశాలు ఏర్పాటు చేసే రైతు పండించే పంటకు ది గుబడి వచ్చేలా చూస్తామన్నారు.  అనంతరం ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎంపి నగేష్, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌లు మాట్లాడుతూ రైతును రాజు చేయాలనే ఉద్ధేశంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్  పెట్టుబడి సాయం అం దస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులు పెట్టుబడి సా యాన్ని ఎన్నికల స్టంట్‌గా భావిస్తున్నారని, ఇది సరికాదన్నారు.   ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, టిఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్‌రావు, జిల్లా ఇంచార్జి ఉమా, జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్, ఆర్డివో సురేష్, జిల్లా వ్యవ సాయాధికారి అలీ,  ఉద్యానవన జిల్లా అధికారి మెహర్‌బాషా,అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో                    పాల్గొన్నారు.