Search
Thursday 15 November 2018
  • :
  • :

ప్రియుణ్ని పెళ్లాడిన ‘రివాల్వర్ రాణి’

Revolver-Rani-Bundhelkhand

మౌదాహా : కొద్ది రోజుల క్రితం తన ప్రియుడు వేరే అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని.. ఏకంగా పెళ్లి మండపంలో అతనిపై తుపాకీ పెట్టి బెదిరించి కిడ్నాప్ చేసి ‘రివాల్వర్ రాణి’ గుర్తుందా.. మొత్తానికి అనేక మలుపుల తర్వాత ఆమె కథ సుఖాంతమైంది. మే 15న ఉత్తరప్రదేశ్‌ బుందేల్‌ఖండ్‌లోని మౌదాహాలో జరిగిన ఈ కిడ్నాప్ ఉదాంతం అప్పట్లో మీడియాలో మారుమోగిపోయింది.

వర్ష సాహు అలియాస్‌ ‘రివాల్వర్‌ రాణి’.. తన ప్రియుడు మరో మహిళను పెళ్లాడేందుకు సిద్ధమవ్వగా.. అతన్ని మండపం నుంచి ఎత్తుకొచ్చేసింది. కిడ్నాప్‌ చేసిన అశోక్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ, ఇంతలో తమ కూతురిని పెళ్లి పేరిట మోసం చేశాడంటూ అశోక్‌పై పెళ్లికూతురు కుటుంబసభ్యులు కేసు పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన అశోక్‌ ఈ నెల 7న జైలు నుంచి విడులయ్యాడు. జైలు బయట అతనికి ఘనస్వాగతం పలికిన వర్ష అతన్నే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. హమిర్‌పూర్‌లోని మతా చౌరా ఆలయంలో వీరి పెళ్లి ఈ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి భోజనాలు సహా అన్ని ఏర్పాట్లను యూపి శివసేన శాఖ దగ్గరుండి చేయించడం గమనార్హం.

The Story Of Revolver Rani Of Bundelkhand Got Happy Ending

Comments

comments