Home వార్తలు హరిశ్చంద్రుడు వంటి నీతిమంతుడి కథ

హరిశ్చంద్రుడు వంటి నీతిమంతుడి కథ

moveపటమటలంక నవీన్, ఈశ్వర్‌రెడ్డి, సుహాస్, నిశాంత్ ప్రధాన పాత్రల్లో సినీ అవుట్ లుక్ క్రియేషన్స్ బ్యానర్‌పై పటమటలంక ప్రవీణ్ దర్శకత్వంలో కళ్యాణ్‌కుమార్ నిర్మిస్తున్న లఘు చిత్రం ‘రాజావారి మిత్ర బృందం’. ఈ సినిమాను ఈనెలలోనే యూట్యూబ్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పటమటలంక ప్రవీణ్ మాట్లాడుతూ “హరిశ్చంద్రుడు వంటి నీతిమంతుడు నేటి యుగంలో ఉంటే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా కథ. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎదుర్కొన్న పరిస్థితులను చాలా ఫన్నీగా చూపించాం. విశ్వనాథ్ అందించిన మ్యూజిక్ కథను మరింత హైలైట్ చేసింది. సినిమాలో ఒక పాట మాత్రమే ఉంటుంది. సుభాష్ మంచి సాహిత్యాన్ని అందించారు. ఈనెలలోనే యూ ట్యూబ్‌లో మా షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం”అని చెప్పారు. నిర్మాత కళ్యాణ్‌కుమార్ మాట్లాడుతూ “నవీన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ షార్ట్ ఫిల్మ్ చేయాలని భావించాను. కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో చేసిన సినిమా ఇది. అవుట్‌పుట్ బాగా వచ్చింది”అని అన్నారు. విశ్వనాథ్ మాట్లాడుతూ “సినిమా కథ కమర్షియల్‌గా అనిపించింది. కళ్యాణ్ కొత్త వాళ్లను ప్రోత్సహించడం సంతోషంగా ఉంది”అని చెప్పారు. ఈ చిత్రానికి ఎడిటర్‌ః చోటు చెర్రీ, ఫొటోగ్రఫీః దీపు రెడ్డి, డాన్స్‌ః సాయి క్రిష్.