Home రాష్ట్ర వార్తలు విద్యార్థిని ఆత్మహత్య

విద్యార్థిని ఆత్మహత్య

sdt

విడియోలో  అవతల వ్యక్తి చూస్తుండగానే  విద్యార్థిని ఆత్మహత్య

మనతెలంగాణ/పేట్‌బషీరాబాద్: ఉరేసుకొని ఎంబిఎ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపూర్‌లోని విద్యుత్ నగర్‌కు చెందిన బుగ్గయ్య చౌదరి కుమార్తె హనీషా చౌదరి (20) నగరంలోని కొంపల్లిలోని శివాశివాని గ్రూపు ఆఫ్ ఇనిస్టిట్యూట్‌లో ఎంబిఎ రెండో సంవత్సరం చదువుతూ గర్ల్ హాస్టల్‌లో నివాసం ఉంటుంది. అయితే హనీషా చౌదరికి ఆదివారం మధ్యాహ్న సమయంలో సెల్‌ఫోన్ లో  ఓ వ్యక్తితో విడియో కాల్ మాట్లాడి అనంతరం ఆ వ్యక్తి చూస్తుండగానే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు కోసం ఆరా తీశారు. అనంతరం మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నట్లు పేర్కొన్నారు. ప్రేమలో మనస్పర్దలు రావడంతోనే మృతి చెందిందా? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తేలిపారు