Home కుమ్రం భీం ఆసిఫాబాద్ విద్యార్థులు చదువులో ముందుండాలి

విద్యార్థులు చదువులో ముందుండాలి

students

మన తెలంగాణ / కాగజ్‌నగర్: విద్యార్థులు మంచి చదివి ఉత్తమ ర్యాంకులు సాధించాలని బిజేపీ నాయకుడు డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కాగజ్‌నగర్ పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థు లు మంచిగా చదివి ఉత్తమ ర్యాంకులు సాధించాలని, ఉన్నత శిక్షరాలు అవిరోదించి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కొత్తపల్లి వెంకలక్ష్మి—— చంద్రయ్య మోమెరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలకు పది బెంచీలను విరాళంగా అందశారు. అనంతరం పాఠశాలలో తెలుగుమహాసభల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు వచ్చిన వారు సైతం ఇతర భాషల్లో తెలుగుభాష మర్చిపోతున్నారు. తెలుగుభాష పరిరక్షణ అందరు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డాక్టర్ అనిత, ఉపాధ్యాయులు పి. గణేష్‌కుమార్,శ్యాంసుందర్, విద్యాసాగర్, డబేసాహబ్, విజయలక్ష్మి, చరణ్‌దాస్,విద్యాసాగర్, రాజన్న,శుభాకర్, పద్మావతి, శ్రీలత, వెంకటరమణ, శ్రీశైలం, విద్యార్థులు పాల్గొన్నారు.