Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

పోటీ పరీక్షలను తట్టుకొనే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి

SANTHI

మన తెలంగాణ/శామీర్‌పేట : పోటీ పరీక్షలను తట్టుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని పాట్నా హైకోర్డు మాజీ న్యాయమూర్తి ఎల్. నర్సింహ్మరెడ్డి అన్నారు. బుధ వారం రాత్రి శామీర్‌పేట మండలం బాబాగూడ పరిధిలోని శాంతినికేతన్ విద్యాలయ స్కూల్ వార్షికోత్సవానికి ఆయ న ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఐఐటి, ఇంజనీరింగ్, ఇతర కాంపిటేషన్ పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రొత్సహం, తోడ్పాటు ఉంటే బాగా రాణిస్తారన్నారు. ఈ పరీక్షలకు ఉపాధ్యాయుల కృషి ఎంతోఉంటేగాని ఇది సాధ్యంకాదన్నారు. బిట్స్, నల్సార్ లాంటి విద్యా సంస్థలు ఉన్నందున ఆ రతరహ బోధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంతంగా ఎదగాలని కోరారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో రాజకీయంగా ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. శాంతినికేతన్ విద్యాలయ స్కూల్ ఆహ్లదకరమైన వాతావరణంలో ఉందని, ఇప్పటి నుంచే పోటి పరీక్షలకు విద్యార్థులను సంసిద్దులను చేస్తుం డటం ఎంతో బాగుందన్నారు. విద్యార్థులు చేసిన సాంస్కృ తిక కార్యక్రమాలను ఆయన తిలకించి వివిధ రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సాగర్‌రావు, డైరక్టర్ పురు షోత్తంరావు, ఎగ్జీక్యూటీవ్ డైరక్టర్ సిద్ధార్థ, ప్రిన్సిపల్ ప్రేమ్ శంకర్ దూబే, ఐవివై పాఠశాల ప్రిన్సిపల్ దీప్‌కరే, ఉపా ధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

comments